వావ్ ! అంతరిక్షం నుంచి ఓటు వేసిన అమెరికన్ వ్యోమగామి

అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబరు 3 న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

  • Umakanth Rao
  • Publish Date - 12:03 pm, Sat, 24 October 20

అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబరు 3 న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు గాను ఆమె అప్పుడే తన ఓటు వేసేశారు. ఆ రోజున తాను రోదసిలోనే ఉంటానని కేట్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష కేంద్రం భూతలానికి సుమారు 200 మైళ్లకు పైగా దూరంలో ఉంది. సెల్ఫీ తీసుకున్న ఆమె.. ట్వీట్ కూడా చేస్తూ.. ఈ నెల 14 న తాను కక్ష్యలో ప్రవేశించినట్టు తెలిపారు. మరో ఆరున్నర నెలల పాటు ఆమె ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉండనున్నారు.

1997 నుంచి అంతరిక్షం నుంచి వ్యోమగాములు ఓటు వేయడాన్ని నాసా సుసాధ్యం చేసింది. అప్పటి నుంచి పలువురు ఎస్ట్రోనట్లు అమెరికా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఫెడరల్ పోస్టు కార్డు ఆప్లికేషన్ ద్వారా స్పేస్ నుంచి ఓటింగ్ ను నిర్వహిస్తున్నారు.