ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా వైరస్

కరోనా కల్లోలానికి ప్రపంచం విలవిలలాడుతోంది. చైనాలో పుట్టిన ఆ మహమ్మారి బారినపడి పెరుగుతున్న కేసులతో జనం అల్లాడిపోతున్నారు. మందు లేని రోగం ఎవరిని అంటుకుంటుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. అత్యధిక కేసులతో అమెరికా, బ్రెజిల్ దేశాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా వైరస్
Follow us

|

Updated on: Jul 03, 2020 | 4:23 PM

కరోనా కల్లోలానికి ప్రపంచం విలవిలలాడుతోంది. చైనాలో పుట్టిన ఆ మహమ్మారి బారినపడి పెరుగుతున్న కేసులతో జనం అల్లాడిపోతున్నారు. మందు లేని రోగం ఎవరిని అంటుకుంటుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు తలామునకలైన వైరస్ నుంచి విముక్తి కలిగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు కరోనా విజృంభణ మాత్రం ఆగడంలేదు.

అటు, అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 52వేల పాజిటివ్‌ కేసులు నమోదవగా, శుక్రవారం కొత్తగా 55,220 మందికి కరోనా పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటివరకు అమెరికాలో ఒకే రోజు ఇంత పెద్దమొత్తం కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా అధికారులతో పాటు జనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరిడాలో అత్యధికంగా 10,109 మందికి కరోనా సోకినట్లు రికర్డులు చెబుతున్నాయి. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 28,37,189కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 1,31,485 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా 15,14,613 మంది కరోనా బారిన పడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకూ 11,91,091 మంది కరోనాను జయించి ఇళ్లకు చేరుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

అటు బ్రెజిల్ లోనూ రెండో దశ కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తుంది. కొత్తగా నమోదు అవుతున్న కేసులు మరింత కలవరాన్ని గురిచేస్తున్నాయి. బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చింది. దేశంలో గురువారం ఒక్కరోజే 48,105 మందికి కొత్తగా కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 15,01,353కు చేరింది. కొవిడ్ బారినపడి ఇప్పటివరకు 61,990 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాతో 5,23,216 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకూ 9,16,147 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందానని ప్రపంచవ్యాప్తం జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..