అమెరికాలో 2 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. నిత్యం లక్షలాది కొత్త కేసులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిత్యం పెరుగుతున్న కేసులతో ప్రపంచదేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి.

అమెరికాలో 2 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 4:03 PM

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. నిత్యం లక్షలాది కొత్త కేసులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిత్యం పెరుగుతున్న కేసులతో ప్రపంచదేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. అటు అగ్రరాజ్యం కరోనా కేసులతో అగ్ర స్థానంలోనే కొనసాగుతుంది. అమెరికాలో కొవిడ్-19 తొలికేసు నమోదై ఎనిమిది నెలలు దాటినా అదేజోరులో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కాగా, కరోనా మరణాల సంఖ్యగా కూడా భారీగా ఉంది. ఇప్పటి వరకు కొవడ్‌ మరణాల సంఖ్య 2,00,005 అని అధికారులు ప్రకటించారు. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 6.8 మిలియన్లు దాటింది. దీనితో కేసులు, మరణాల సంఖ్యలో కూడా అమెరికాయే తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్త కరోనా వైరస్‌ మరణాల్లో ఐదో వంతు ఇక్కడే సంభవిస్తున్నాయని గణాంకాలు చెపుతున్నాయి. ఇదిలా ఉండగా, ఫాల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్‌ పరంగా అమెరికా మరింత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ హెచ్చరించారు.

కాగా, ఒక్కసారి అమెరికా వ్యాప్తంగా నమోదై మరణాల సంఖ్యను పరిశీలిస్తే, న్యూయార్క్‌ రాష్ట్రంలో అత్యధికంగా 33,092 మంది కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత 16,069 మరణాలతో న్యూజెర్సీ రెండో స్థానంలో ఉంది. ఇక టెక్సాస్‌, కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో రాష్ట్రాల్లో కరోనా మరణాలు 13,000 కు పైగా నమోదయ్యాయి. మరోవైపు ఇల్లినాయిస్‌, మస్సాచ్యుసెట్స్‌, పెన్సిల్వేనియాల్లో కూడా మృతుల సంఖ్య ఏడువేలను మించిపోయింది. అమెరికాలో తొలి లక్ష మరణాలు మే 27 నాటికి సంభవించగా.. కేవలం నాలుగు నెలల్లోనే ఈ సంఖ్య రెట్టింపు కావటం విశేషం. ఇదే తీరు కొనసాగితే, ఈ ఏడాది చివరికల్లా 3,70,000 మందికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతారని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, రాబోయే శీతాకాలం దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా