పెళ్లిలో మిఠాయిలు పెట్టలేదని బావమరిదిని చంపేడు వరుడు

వివాహ విందులో మిఠాయిలు వడ్డించే విషయంలో వరుడు, అతని స్నేహితులు వధువు తరపు బంధువులతో వాదనకు దిగారు. వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, ఒక బాలికను ఢీకొట్టి గాయపర్చాడు. అనంతరం తొమ్మిదేళ్ల బావమరిది చావుకు కారణమయ్యాడు.

పెళ్లిలో మిఠాయిలు పెట్టలేదని బావమరిదిని చంపేడు వరుడు
Follow us

|

Updated on: Jun 18, 2020 | 1:03 PM

వివాహ విందులో మిఠాయిలు సరిగా వడ్డించలేదని వరుడు, వధువు తరపు బంధువులతో వాదనకు దిగాడు. అంతటితో ఆగకుండా వాహనంతో బంధువులపైకి దూసుకెళ్లాడు. సొంత బావమరిది తొమ్మిదేళ్ల బాలుడి చావుకు కారణమయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటన పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫరుఖాబాద్‌కి చెందిన మనోజ్‌కుమార్‌ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో మిఠాయిలు వడ్డించే విషయంలో వరుని స్నేహితులు వధువు తరపు బంధువులతో వాదనకు దిగారు. దీంతో మద్యం మత్తులో ఉన్న వరుడు జోక్యం చేసుకున్నాడు. రెండు కుటుంబాల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. దీంతో వరుడి స్నేహితులు తన మామయ్యపై కాల్పులు జరిపినట్లు వధువు సోదరుడు తెలిపాడు. అనంతరం అక్కడే నీళ్లు అందిస్తున్న తన సోదరుడు ప్రన్షు (9)ను వరుడు, అతని స్నేహితులు తమ వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని వెల్లడించాడు. ఈ క్రమంలో వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, ఒక బాలికను ఢీకొట్టినట్లు తెలిపాడు. తిరిగి రావాలని వరుడు మనోజ్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొమ్మిదేళ్ల తన తమ్ముడు ప్రన్షు మృతదేహాన్ని గ్రామశివారులో వదిలివెళ్లారని ఆయన వెల్లడించారు. దీంతో వధువు తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రన్షు మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులున్నాయని వధువు కుటుంబ సభ్యులు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరుడు, అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..