పార్లమెంటులో ‘ దిశ ‘ ప్రతిధ్వని.. రేపిస్టులకు ఉరే సరి అంటున్న పార్టీలు

తెలంగాణ డాక్టర్ దిశ రేప్, మర్డర్ ఉదంతం సోమవారం పార్లమెంటును కుదిపివేసింది. లోక్ సభ, రాజ్యసభ రెండింటిలోను పాలక, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై వాయిదా తీర్మానాలను సమర్పించాయి. దీనిపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. దిశ హత్యాచార ఘటనపై రాజ్యసభలో స్వయంగా చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొద్దిసేపు ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. ఈ దారుణ ఘోరానికి పాల్పడినవారికి కఠిన శిక్షలు విధించాలని, క్షమా భిక్ష పనికిరాదని అన్నారు. ఈ విధమైన నేరాలను అరికట్టడానికి ‘ బిల్లు […]

పార్లమెంటులో ' దిశ  ' ప్రతిధ్వని.. రేపిస్టులకు ఉరే సరి అంటున్న పార్టీలు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 02, 2019 | 4:39 PM

తెలంగాణ డాక్టర్ దిశ రేప్, మర్డర్ ఉదంతం సోమవారం పార్లమెంటును కుదిపివేసింది. లోక్ సభ, రాజ్యసభ రెండింటిలోను పాలక, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై వాయిదా తీర్మానాలను సమర్పించాయి. దీనిపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. దిశ హత్యాచార ఘటనపై రాజ్యసభలో స్వయంగా చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొద్దిసేపు ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. ఈ దారుణ ఘోరానికి పాల్పడినవారికి కఠిన శిక్షలు విధించాలని, క్షమా భిక్ష పనికిరాదని అన్నారు. ఈ విధమైన నేరాలను అరికట్టడానికి ‘ బిల్లు ‘ కాదు.. గట్టి రాజకీయ అభిమతం ఉండాలి అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా.. మహిళలపై అత్యాచారాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయని, వీటిని తక్షణమే అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అటు-తెలంగాణ డాక్టర్ పై హత్యాచారం తీవ్రంగా ఖండించదగినదని, మృగాళ్లను బహిరంగంగా ఉరి తీయాలని ఎంపీ జయబచ్చన్ డిమాండ్ చేశారు. ఇప్పటికే జరిగింది చాలు.. ఇకనైనా మేల్కొందాం.. రేపిస్టులపై ఏ మాత్రం జాలి పనికి రాదు.. అంతా ఒక్కటై ఆ కీచకులకు మరణ శిక్ష పడేలా చూద్దాం అని ఆమె అన్నారు. ఇక ఈ కేసు విషయంలో జాప్యం లేకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. లోక్ సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్.. కేవలం చట్టాలతో ఈ విధమైన ఘటనలకు అడ్డుకట్ట వేయలేమని, అంతా కలిసికట్టుగా ఒక్క తాటిపైకి వస్తే దేశంలో ఇలాంటి మృగాళ్లకు చెక్ పెట్టవచ్ఛునని అన్నారు. ఈ అంశంపై చర్చకు అనుమతిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. దిశపై హత్యాచారం చేసిన నలుగురిని డిసెంబరు 31 లోగా ఉరి తీయాలని, మరణించేంత వరకు ఉరే సరి అని అన్నా డీఎంకే సభ్యుడు విజిల సత్యానంద్ ఆవేశంగా వ్యాఖ్యానించారు.