గురువు ఎంట్రీ రోజునే శిష్యుడి ఎంట్రీ..!

కరోనా ఎఫెక్ట్ సినిమాలపై కూడా పడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చింది టాలీవుడ్.

గురువు ఎంట్రీ రోజునే శిష్యుడి ఎంట్రీ..!
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 12:43 PM

కరోనా ఎఫెక్ట్ సినిమాలపై కూడా పడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చింది టాలీవుడ్. అంతేకాదు మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో విడుదలవ్వానుకున్న పలు చిత్రాలు వాయిదా పడ్డాయి. వీటిలో ‘ఉప్పెన’ ఒకటి. మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. వీరిద్దరికీ ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మే 7న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు టాక్‌.

అయితే 16ఏళ్ల క్రితం అదే రోజు ‘ఆర్య’ విడుదలైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా సుకుమార్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇక అప్పట్లో ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తన గురువు మొదటి సినిమా వచ్చిన రోజునే తన మొదటి మూవీని విడుదల చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట. గురువు సెంటిమెంట్ తనకు కలిసివస్తుందని ఆయన అనుకుంటున్నారట. ఇక ఈ నిర్ణయానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించింది. తమిళ స్టార్ నటుడు ఇళయ దళపతి విజయ్‌ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్లు, పాటలు ఆకట్టుకున్న ఈ మూవీపై మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: లక్షల్లో మిగిలిన శ్రీవారి లడ్డూలు.. ఏం చేశారంటే..!