ఆవుకు మేత వేసి.. పేడ ఎత్తిన మెగా కోడలు..

మెగా కోడలు ఉపాసన కొణిదెల.. లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకుంటూ.. కొత్త పనులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఫామ్ హాస్‌లో ఆధునిక వ్యవసాయం ఎలా చేస్తారో నేర్చుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ..

ఆవుకు మేత వేసి.. పేడ ఎత్తిన మెగా కోడలు..
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 1:39 PM

మెగా కోడలు ఉపాసన కొణిదెల.. లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకుంటూ.. కొత్త పనులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఫామ్ హాస్‌లో ఆధునిక వ్యవసాయం ఎలా చేస్తారో నేర్చుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. కొత్త చిట్కాలు చెప్పే ఉపాసన.. తండ్రి అనిల్ కామినేనితో కలిసి తమ ఫామ్‌హౌస్‌లో.. ఆవుకు మేత వేసి, పెడను ఎత్తి సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా షేర్ చేసింది.

‘సేంద్రీయ వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నా. ఎరువు తయారు చేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో శిక్షణ తీసుకుంటున్నా. నిరాడంబర జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొంది ఉపాసన.

Read More:

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?