39 మంది అత్యాచారం చేశారంటూ పీఎస్‌లో ఫిర్యాదు.. విషయం తెలిస్తే..

దేశంలో తాజాగా అత్యాచార ఘటనల ఫిర్యాదులపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. రేప్‌లకు గురైన బాధితులు ఫిర్యాదు చేయడంతోనే వెంటనే స్పందించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపుతూ.. శిక్షపడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఈ వ్యవస్థను ఆసరాగా తీసుకుని.. చట్టంతో ఆటలాడుతున్నారు కొందరు. యూపీలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలోని బరేలీ జిల్లాకి […]

39 మంది అత్యాచారం చేశారంటూ పీఎస్‌లో ఫిర్యాదు.. విషయం తెలిస్తే..
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 6:11 AM

దేశంలో తాజాగా అత్యాచార ఘటనల ఫిర్యాదులపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. రేప్‌లకు గురైన బాధితులు ఫిర్యాదు చేయడంతోనే వెంటనే స్పందించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపుతూ.. శిక్షపడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఈ వ్యవస్థను ఆసరాగా తీసుకుని.. చట్టంతో ఆటలాడుతున్నారు కొందరు. యూపీలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.

రాష్ట్రంలోని బరేలీ జిల్లాకి చెందిన ఓ మహిళ.. తనపై 39మంది అత్యాచారం చేశారంటూ పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. 32 ఏళ్లు ఉన్న సదరు మహిళ.. తనను గ్రామానికి చెందిన 39 మంది బలాత్కారం చేశారంటూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ.. సదరు బాధితురాలి గ్రామం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని.. అక్కడి పోలీసులను పిలిపించారు.

అయితే ఈ విషయం కాస్త గ్రామస్థులకు తెలిసింది. దీంతో వెంటనే ఆ గ్రామస్థులంతా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ధర్నాకు దిగారు. బాధిత మహిళ.. తమపై తప్పుడు ఫిర్యాదు చేస్తోందని ఆరోపించారు. సదరు మహిళ, ఆమె భర్త గ్రామానికి చెందిన కొందరి వ్యక్తుల వద్ద నుంచి దాదాపు.. రెండున్నర లక్షల రూపాయల అప్పు తీసుకున్నారని.. వాటిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో.. ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.

కాగా, పోలీసులు మాత్రం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. సదరు మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న గ్రామస్థులతో ఎస్పీ మాట్లాడారు. తగిర సాక్ష్యాధారాలతో కేసులో నిందితులగా తేలిన వారిని అరెస్ట్ చేస్తామన్నారు.

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ