తలాక్‌ చెప్పలేదని..కిరోసిన్ పోసి తగులబెట్టాడు!

Husband burned wife alive for not saying Triple Talaq, తలాక్‌ చెప్పలేదని..కిరోసిన్ పోసి తగులబెట్టాడు!

ఉత్తర్‌ప్రదేశ్‌: ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇటీవలే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకువచ్చిన  విషయం తెలిసిందే. అయినా కొందరు ప్రబుద్దులు చట్టాన్ని పట్టించుకోకుండా..నిరకుశంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తలాక్‌ చెప్పడానికి నిరాకరించిందని కట్టుకున్న భార్యను కన్నబిడ్డ కళ్లెదుటే ఓ దుర్మార్గుడు సజీవ దహనం చేశాడు. ఈ దారుణంతో ఆమె కన్నవారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నిందితుడు రఫీక్‌ది యూపీలోని శ్రావస్తి. కుటుంబాన్ని ఇక్కడే వదిలేసి మహారాష్ట్రలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతను ఫోన్‌లో భార్యకు మూడు సార్లు తలాక్‌ చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చిన అతను ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశాడు.. లొంగకపోవడంతో దాడి చేశాడు. కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. కన్నతండ్రి కర్కశాన్ని కళ్లారా చూసిన ఐదేళ్ల చిన్నారి విషయాన్ని తన మేనమామకు తెలిపింది. ఆయన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

Husband burned wife alive for not saying Triple Talaq, తలాక్‌ చెప్పలేదని..కిరోసిన్ పోసి తగులబెట్టాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *