గుడ్‌న్యూస్‌.. కరోనాకు ఆయుర్వేదంతో చెక్.. 20 మందిపై ప్ర‌యోగం సక్సెస్‌..!

ప్రపంచ దేశాలన్ని కరోనాతో గజగజవణికిపోతున్నాయి. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్లు రెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మన దేశంలో కూడా అనేక ప్రయత్నాలు జరుగుతుండగా.. ఆయుర్వేద చికిత్సతో కూడా కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రయోగాలు చేపడుతున్నారు.

గుడ్‌న్యూస్‌.. కరోనాకు ఆయుర్వేదంతో చెక్.. 20 మందిపై ప్ర‌యోగం సక్సెస్‌..!
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 5:02 PM

ప్రపంచ దేశాలన్ని కరోనాతో గజగజవణికిపోతున్నాయి. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 63 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మన దేశంలో కూడా రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్లు రెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాలు క్లినికల్‌ ట్రయల్స్‌కు కూడా చేపడుతున్నాయి. అయితే మన దేశంలో కూడా కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా.. ఆయుర్వేద చికిత్సతో కూడా కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రయోగాలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో యూపీలోని ఇటావాలో ఉన్న సైఫై మెడికల్‌ విశ్వవిద్యాలయం తయారుచేసిన ఆయుర్వేద ఔషధం కరోనాను నివారించడంలో సఫలమైందని తెలుస్తోంది. రాజ్ నిర్వాణ్‌ బూటీ (ఆర్‌ఎన్‌బి) అనే ఔషధాన్ని ఈ యూనివర్సిటీలో చేరిన 20 మంది కరోనా సోకిన వారిపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సానుకూల ఫలితాలు కనిపించాయని డాక్టర్‌ రాజ్‌కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మెడిసిన్‌పై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని.. త్వరలో అందరికీ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఔషధం పన్నెండు రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేశామని.. కరోనా రోగులపై పరిశోధనల ప్రోటోకాల్‌ ప్రకారమే దీనిని రెడీ చేశామని పేర్కొన్నారు. మన దేశంలో కరోనా కేసు నమోదైన వెంటనే యూనివర్సిటీలో ప్రయోగాలు ప్రాంరభించామని.. దీనిని రెడీ చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆయుర్వేద సైంటిస్టుల సహాయాన్ని కూడా తీసుకున్నామని తెలిపారు. మరో 20 మంది కరోనా సోకిన వారిపై ప్రయోగాలు చేపడుతున్నామని.. వీరికి కూడా కరోనా నుంచి విముక్తి కలిగితే.. సక్సెస్‌ అయినట్లు భావించవచ్చన్నారు. ఒకవేళ ఈ మెడిసిన్ సక్సెస్‌ అయితే.. కరోనాకు మందు కనుగొన్న ఘనత మన దేశానికే దక్కుతుందని తెలిపారు.

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..