మైనర్లపై జరుగుతున్నవే రేప్‌లా..? నోరుపారేసుకున్న యూపీ మంత్రి

అలీగఢ్ వద్ద రెండేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటనపై యూపీ మంత్రి ఉపేంద్ర తివారీ స్పందించారు. ఈ నేపథ్యంలో అత్యాచారం కేసుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. తమ అక్రమ సంబంధం కొనసాగించి, చాలా మంది ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతున్నారంటూ మహిళలను కించపరిచేలా తివారీ వ్యాఖ్యానించారు. తప్పు తాము చేస్తూ.. పైగా ఆపై తమను రేప్ చేశారని పురుషులపై కేసులు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం జరిగే […]

మైనర్లపై జరుగుతున్నవే రేప్‌లా..? నోరుపారేసుకున్న యూపీ మంత్రి
Follow us

|

Updated on: Jun 10, 2019 | 2:30 PM

అలీగఢ్ వద్ద రెండేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటనపై యూపీ మంత్రి ఉపేంద్ర తివారీ స్పందించారు. ఈ నేపథ్యంలో అత్యాచారం కేసుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. తమ అక్రమ సంబంధం కొనసాగించి, చాలా మంది ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతున్నారంటూ మహిళలను కించపరిచేలా తివారీ వ్యాఖ్యానించారు. తప్పు తాము చేస్తూ.. పైగా ఆపై తమను రేప్ చేశారని పురుషులపై కేసులు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం జరిగే తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. ఓ మైనర్ పై అత్యాచారం జరిగితే దానిని రేప్‌గా పరిగణించాలన్నారు. కానీ, 30 నుంచి 35 ఏళ్ల మహిళ వచ్చి తనను రేప్ చేశారంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారాయన. మంత్రి చేసిన వాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అత్యాచార ఘటనలు సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వస్తే ఆయన స్పందించి, కఠిన చర్యలకు ఆదేశిస్తున్నారని ఉపేంద్ర తివారి అన్నారు.