పొల్యూషన్ ఎఫెక్ట్‌లో ‘తాజ్‌‌మహల్’.. యూపీ ప్రభుత్వం ఏం చేసిందంటే!

గత కొద్ది రోజులుగా.. ఢిల్లీ… వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నిన్న ఏకంగా.. 1000 సూచిని దాటి రికార్డు బ్రేక్ చేసింది. దీంతో.. అధికారులు మరింత సమాయత్తం అవుతున్నారు. కాగా.. ఢిల్లీ కాలుష్యంతో.. భారతదేశ చారిత్రాత్మక కట్టడం.. తాజ్‌మహాల్ తేజస్సు మసకబారుతోంది. గాలిలోని కర్బన రేణువులు, దుమ్ము కారణంగా.. తాజ్‌ మహల్ తేజస్సు తగ్గిపోతోందని.. నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. తాజ్ చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా.. వాయు కాలుష్యంతో నిండిపోయింది. అయితే.. తాజ్‌ను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ […]

పొల్యూషన్ ఎఫెక్ట్‌లో 'తాజ్‌‌మహల్'.. యూపీ ప్రభుత్వం ఏం చేసిందంటే!
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 1:31 PM

గత కొద్ది రోజులుగా.. ఢిల్లీ… వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నిన్న ఏకంగా.. 1000 సూచిని దాటి రికార్డు బ్రేక్ చేసింది. దీంతో.. అధికారులు మరింత సమాయత్తం అవుతున్నారు. కాగా.. ఢిల్లీ కాలుష్యంతో.. భారతదేశ చారిత్రాత్మక కట్టడం.. తాజ్‌మహాల్ తేజస్సు మసకబారుతోంది. గాలిలోని కర్బన రేణువులు, దుమ్ము కారణంగా.. తాజ్‌ మహల్ తేజస్సు తగ్గిపోతోందని.. నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. తాజ్ చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా.. వాయు కాలుష్యంతో నిండిపోయింది.

అయితే.. తాజ్‌ను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎలాగైనా చారిత్రాత్మక కట్టడాన్ని కాపాడుకునేందుకు ఓ కొత్త ఐడియాను సిద్ధపరిచింది. తాజ్‌ మహల్ పరిసరాలను, ఆ ప్రాంతాల్లోని గాలిని శుభ్రపరిచే ‘ఎయిర్ ఫ్యూరిఫైయర్లను‌’ తీసుకొచ్చింది. కాలుష్య నియంత్రణ వ్యాన్ 300 మీటర్ల వ్యాసార్థంలో 8 గంటల్లో 15 లక్షల క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుందని అధికారులు తెలిపారు. యూపీకి తోడుగా.. సామాజిక బాధ్యతలో భాగంగా దిగ్గజ టెలికాం సంస్థలు వొడాఫోన్-ఐడియా కూడా ముందుకొచ్చాయి. కాగా.. తాజ్‌మహాల్ వద్ద కాలుష్యం ఎక్కువగా ఉండటం ద్వారా.. ప్రస్తుతం సందర్శకులను కూడా.. అనుమతించడం లేదు.