యోగీ సర్కార్ సంచలనం.. ఆరు నెలలు ఎస్మా ప్రయోగం!

కరోనా కాలంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు రాష్ట్రంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) ప్రయోగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాధ్ వెల్లడించారు. దీనికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా అనుమతి ఇవ్వడంతో.. రాష్ట్ర అదనపు కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ చట్టం అమలులో ఉండటం వల్ల అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగాలు ఎవ్వరూ కూడా ఆరు నెలల పాటు సమ్మె చేసేందుకు వీలు […]

యోగీ సర్కార్ సంచలనం.. ఆరు నెలలు ఎస్మా ప్రయోగం!
Follow us

|

Updated on: May 23, 2020 | 9:36 PM

కరోనా కాలంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు రాష్ట్రంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) ప్రయోగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాధ్ వెల్లడించారు. దీనికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా అనుమతి ఇవ్వడంతో.. రాష్ట్ర అదనపు కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఉత్తర్వులను జారీ చేశారు.

ఈ చట్టం అమలులో ఉండటం వల్ల అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగాలు ఎవ్వరూ కూడా ఆరు నెలల పాటు సమ్మె చేసేందుకు వీలు లేకుండా నిషేధం కొనసాగుతుంది. అలా కాదని ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏడాది పాటు జైలుశిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా ఒక్కోసారి రెండు శిక్షలను విధించే అవకాశం ఉంటుందని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిరసనలు ఎదుర్కునే అవకాశం ఉండటంతో యోగీ సర్కార్ ఎస్మా చట్టాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.