Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: నిమ్మగడ్డ అంశం పై కొనసాగుతున్న ప్రభుత్వం కసరత్తు . ఇప్పటికే సుప్రీం కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం . నిమగడ్డ తనంతట తాను పునః నియమిచుకున్న సర్కులర్ ను వెనక్కు తీసుకున్న ఎస్ఈసి.
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • బంజారాహిల్స్ లో దారుణం. భార్యను హతమార్చిన భర్త. భార్య భర్తల గొడవతో హీటర్ తో బాధి హత్య చేసిన భర్త. తలకు గాయం కావడం తో మృతి చెందిన భార్య. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.
  • ఈరోజుతో ముగియనున్న సర్వేలేన్స్ సర్వే. ఎలిజా ప్రక్రియ ద్వారా రక్త నమూనా సేకరిస్తున్న ICMR ,NIN. జిహెచ్ఎంసి లోని ఐదు ప్రాంతాలలో ఈరోజు సర్వే. 18 సంవత్సరాలు పై బడిన అన్ని వయసుల వారికి టెస్టులు చేస్తున్న NIN. ఒక్కో కంటైన్మెంట్ జోన్ 100 శాంపిల్స్ తీసుకుంటున్న ICMR,NIN అధికారులు. మొత్తం రంగారెడ్డి,ghmc లలో 500 శాంపిల్స్ తీసుకోనున్న బృందాలు. మొత్తం సిరం శాంపిల్స్ ను చెన్నై పంపనున్న ICMR,NIN అధికారులు.
  • తిరుపతి లో గంజాయి మత్తుగాళ్ళ హాల్ చల్ . తాతయ్యగుంట లో గంజాయి మత్తులో యువకుడి పై కత్తితో దాడి . శనివారం రాత్రి సంఘటన . దాడికి పాల్పడిన ఆరుగురు దుండగులు . కతిదాడిలో తీవ్రంగా గాయపడిన వెంకట సాయి (15). రుయా ఆసుపత్రి కి తరలింపు... ప్రాథమిక చికిత్స . తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

సీఎం నిర్ణయం: 35 లక్షల మంది కూలీలకు రోజుకు వెయ్యి..

కరోనా కల్లొలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. వైరస్ విస్తరించకుండా పటిష్ట జాగ్రత్త చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా అనేక ఆంక్షాలు అమలు చేస్తోంది. అవసరముంటేనే...
up cm yogi adityanath says daily wage workers to get rs 1000 per day, సీఎం నిర్ణయం: 35 లక్షల మంది కూలీలకు రోజుకు వెయ్యి..

కరోనా కల్లొలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. వైరస్ విస్తరించకుండా పటిష్ట జాగ్రత్త చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా అనేక ఆంక్షాలు అమలు చేస్తోంది. అవసరముంటేనే బయటకు రావాలని ప్రభుత్వాలు ప్రజలను ఆదేశించాయి. దీంతో ప్రతి ఒక్కరూ నివాసాలకే పరిమితం అవుతున్నారు. అన్ని పనులు వాయిదా వేడయంతో.. దినసరి కూలీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునే దిశగా విస్తృత కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే, రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారి కూలీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆఫర్‌ ప్రకటించారు. యూపీలోని 15 లక్షల మంది రోజువారి కూలీలతో పాటు భవన నిర్మాణ రంగంలో పని చేసే 20.37 లక్షల మంది కార్మికులకు రోజుకు రూ. వెయ్యి చొప్పున ఇస్తామని యోగి స్పష్టం చేశారు. ఈ డబ్బు.. కూలీల నిత్యవసర సరుకులకు, పనులకు ఉపయోగపడుతుందని యూపీ సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 23 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 9 మంది కోలుకున్నట్లుగా అక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Related Tags