పేదలకు సంక్షేమ పథకాలు చేరాలంటే గ్రేటర్‌లో బీజీపీ గెలవాలి.. బల్దియా ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి అదిత్యనాథ్

కేంద్రం నుంచి నేరుగా పేదలకు సంక్షేమ పథకాలు చేరాలంటే బల్దియా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:58 pm, Sat, 28 November 20

కేంద్రం నుంచి నేరుగా పేదలకు సంక్షేమ పథకాలు చేరాలంటే బల్దియా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా ఆయన కూకట్ పల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. స్వేచ్ఛ భారత నిర్మాణం భారత ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వాలకు సాధ్యం కానీ, ట్రిపుల్ తలాక్ , ఆయోధ్య రామమందిర నిర్మాణంన, కశ్మీర్ సమస్య పరిష్కారం ప్రధాని మోదీ చేసి నిరూపించారన్నారు. గడిచి మూడేళ్ల పాలనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల నిరుపేదల కుటుంబాలకు ప్రధాని అవాజ్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇచ్చామన్న యోగి.. గత ఆరేళ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంత మందికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే హైదరాబాద్ మేయర్ గా బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.