యూపీలో బీజేపీ.. నేను సైతం అన్న సమాజ్ వాదీ !

యూపీలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు చోట్ల లీడింగ్ లో ఉంది. అటు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానంలో గెలిచి.. మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. గంగోయ్, లక్నో కంటోన్మెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. జైద్ పూర్ సీటును సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్.. సోనీలాల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు మాయావతి […]

యూపీలో బీజేపీ.. నేను సైతం అన్న సమాజ్ వాదీ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 24, 2019 | 7:58 PM

యూపీలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు చోట్ల లీడింగ్ లో ఉంది. అటు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానంలో గెలిచి.. మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. గంగోయ్, లక్నో కంటోన్మెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. జైద్ పూర్ సీటును సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్.. సోనీలాల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. నిజానికి ఈ ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గానీ, మాయావతి గానీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బై పోల్స్ ని తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అఖిలేష్, మాయావతి నేతృత్వాల్లోని రెండు పార్టీలూ ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా ఈ ఉప ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలను కూడా ఆయన ప్రతిష్టాత్మకంగా భావించారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.