పెళ్లిలో ఉల్లి, వెల్లుల్లి దండలు మార్చుకున్న వధూవరులు!

ఉల్లి పాయలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి ధరలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో సామజిక మాధ్యమాల్లో ఉల్లి వాడకం పై సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో వారణాసిలోని ఒక జంట వారి పెళ్లి రోజున ఆచారంలో భాగంగా దండలు మార్చుకున్నారు. కాని ఆ దండలు పువ్వులకు బదులుగా ఉల్లిపాయలు, వెల్లుల్లితో తయారు చేయబడ్డాయి. ఉల్లిపాయల అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ జంట ప్రచారం చేయాలనుకుంది. కాగా.. వివాహానికి హాజరైన అతిథులు కూడా ఈ జంటకు […]

పెళ్లిలో ఉల్లి, వెల్లుల్లి దండలు మార్చుకున్న వధూవరులు!
Follow us

| Edited By:

Updated on: Dec 15, 2019 | 12:51 AM

ఉల్లి పాయలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి ధరలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో సామజిక మాధ్యమాల్లో ఉల్లి వాడకం పై సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో వారణాసిలోని ఒక జంట వారి పెళ్లి రోజున ఆచారంలో భాగంగా దండలు మార్చుకున్నారు. కాని ఆ దండలు పువ్వులకు బదులుగా ఉల్లిపాయలు, వెల్లుల్లితో తయారు చేయబడ్డాయి. ఉల్లిపాయల అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ జంట ప్రచారం చేయాలనుకుంది. కాగా.. వివాహానికి హాజరైన అతిథులు కూడా ఈ జంటకు ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చారు.

సమాజ్ వాదీ పార్టీకి చెందిన కమల్ పటేల్ మాట్లాడుతూ.. “గత కొంత కాలంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, కాబట్టి ఇప్పుడు ప్రజలు వాటిని బంగారంలా విలువైనదిగా పరిగణించడం ప్రారంభించారు. అందుకే ఈ వివాహంలో వధూవరులు ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి దండను ఉపయోగించారు.” అని తెలిపారు.

మరో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ కొత్త జంట ఉల్లిపాయల అధిక ధరలను వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల ఈ అసాధారణ పద్ధతిని ఎంచుకున్నారని తెలిపారు. ఎస్పీ నాయకుల అభిప్రాయం ప్రకారం, వారణాసి మార్కెట్లలో ఉల్లిపాయల ధర పెరుగుతూనే ఉంది.

[svt-event date=”15/12/2019,12:19AM” class=”svt-cd-green” ]

[/svt-event]