బిస్కెట్లు తినే చనిపోయారా.? ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులో తేలనుందా..?

కర్నూలు జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి కేసుపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. నిజంగా ఆ పిల్లలు బిస్కెట్‌ తినే చనిపోయారా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ అధికారులు బిస్కెట్‌ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెబుతున్న నేపథ్యంలో రిపోర్ట్స్‌లో ఏమొస్తుందన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది...

బిస్కెట్లు తినే చనిపోయారా.? ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులో తేలనుందా..?
Follow us

|

Updated on: Sep 19, 2020 | 11:47 AM

Unsolved mystery : కర్నూలు జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి కేసుపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. నిజంగా ఆ పిల్లలు బిస్కెట్‌ తినే చనిపోయారా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ అధికారులు బిస్కెట్‌ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెబుతున్న నేపథ్యంలో రిపోర్ట్స్‌లో ఏమొస్తుందన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఆళ్లగడ్డ మండలం చింతకొమ్ముదిన్నెలో వారం రోజుల క్రితం రోజ్‌ బిస్కెట్లను తిన్న హుస్సేన్‌భాష, హుస్సేన్‌ బీ, జమాల్‌ బీ అనే ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం తీవ్ర కలవరం రేపింది. ఆ కన్నవారికి తీరని గుండెకోతను మిగిల్చింది.

అయితే 30 ఏళ్లుగా బిజినెస్‌ చేస్తున్నా ఏనాడూ ఇలాంటి రిమార్క్‌ రాలేదని సదరు రోజ్‌ బిస్కెట్‌ డీలర్‌, రిటైల్‌ డిస్ట్రిబ్యూటర్‌ చెబుతున్నారు. బిస్కెట్లే కారణం అయి ఉంటుందని అనుకోవడం లేదని, రిపోర్ట్స్‌ వస్తే కానీ అసలు విషయం తెలియదని అంటున్నారు.

రోజ్‌ మ్యాంగో క్రీం బిస్కెట్లు తినే చనిపోయారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా సరైన కారణాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. దాంతో ఫోరెన్సిక్‌ రిపోర్ట్స్‌లో అయినా తేలుతుందా లేదా అన్న దానికి రిపోర్ట్స్‌ వస్తే కానీ అసలు విషయం తెలియదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ముగ్గురు పిల్లల ప్రాణాలు పోవడం చింతకొమ్ముదిన్నె గ్రామాన్ని చిన్నబోయేలా చేసింది.