మరో వివాదంలో ఫేస్‌బుక్.. యూజర్ల ఫోన్ నంబర్లు లీక్..!

Unsecured Facebook Databases Leak Data Of 419 Million Users, మరో వివాదంలో ఫేస్‌బుక్.. యూజర్ల ఫోన్ నంబర్లు లీక్..!

ఫేస్ బుక్.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు దాదాపుగా ఉపయోగించే సామాజిక మాధ్యమం. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా మరో వివాదంలో చిక్కుకుంది. గతంలో డాటా లీకేజ్ వ్యవహారంలో ఫేస్‌బుక్‌ వివాదంలో చిక్కుకుని ఇబ్బందుల్లో పడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అలాంటి వివాదంలోనే ఇరుక్కుపోయింది. ఫేస్‌బుక్‌ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో 41.9 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల వివరాలు బహిర్గతమయ్యాయని టెక్‌ క్రంచ్‌ అనే మీడియా సంస్థ తెలిపింది. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో ఫేస్‌బుక్ యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చేశాయని పేర్కొంది. ఫేస్‌బుక్‌ సర్వర్‌కు పాస్‌వర్డ్‌ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనీ, దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్‌ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందన్న ఆ సంస్థ.. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకొచ్చామని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఫేస్‌బుక్ స్పందించింది. 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయన్న ఫేస్‌బుక్.. ఈ సమాచారమంతా చాలా పాతదంటూ వివరణ ఇచ్చింది. ఏది ఏమైనా.. ఫేస్‌బుక్ నుంచి వ్యక్తిగత సమాచారం బయటకు లీక్ అయ్యిందంటూ వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు. సో బీ కేర్‌ఫుల్ ఫేస్‌బుక్ యూజర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *