మరో విషాదం.. చికిత్స పొందుతూ.. ఉన్నావ్‌ బాధితురాలు మృతి

చావుబతుకుల మధ్య పోరాడుతూ.. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు తన తుదిశ్వాస విడిచింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి 11.40 గంటలకు ప్రాణాలువిడిచినట్లు డాక్టర్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఉన్నావ్‌కు చెందిన ఓ యువతి.. తనపై అత్యాచారం జరిపారని.. మార్చిలో ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లేందుకు సదరు బాధితురాలు బయల్దేరింది. అయితే కోర్టుకు […]

మరో విషాదం.. చికిత్స పొందుతూ.. ఉన్నావ్‌ బాధితురాలు మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 07, 2019 | 10:41 AM

చావుబతుకుల మధ్య పోరాడుతూ.. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు తన తుదిశ్వాస విడిచింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి 11.40 గంటలకు ప్రాణాలువిడిచినట్లు డాక్టర్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఉన్నావ్‌కు చెందిన ఓ యువతి.. తనపై అత్యాచారం జరిపారని.. మార్చిలో ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లేందుకు సదరు బాధితురాలు బయల్దేరింది. అయితే కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఆమెను.. ప్రధాన నిందితులు దారిలో అటకాయించి.. ఆమెపై హత్యాయత్నం చేశారు. ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. దీంతో బాధితురాలు మంటలతో.. కేకలు వేస్తూ పరుగులు తీసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మంటలను ఆర్పివేసి.. విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శరీరం 90శాతంకి పైగా కాలిపోవడంతో.. మెరుగైన చికిత్స కోసం.. యూపీ నుంచి ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. రెండు రోజులపాటు చికిత్స పొందిన తర్వాత.. బాధితురాలు తన తుది శ్వాస విడిచింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. అయిదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??