Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

అంత్యక్రియలకు సీఎం రావాల్సిందే: భద్రతలు కట్టుదిట్టం

Unnao victim's Funeral, అంత్యక్రియలకు సీఎం రావాల్సిందే: భద్రతలు కట్టుదిట్టం

మృగాళ్లకు ధీటుగా బతికితే.. నిప్పంటించి చంపేస్తారు అని.. ఉన్నావ్ ఘటన నిరూపించింది. కాగా.. ఈ రోజు ఆమెకు తన సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. యూపీలోని హిందూపూర్‌లో ఆమెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి బాధితురాలి మృతదేహాన్ని.. వారి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ సందర్భంగా.. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ఆమెకు సమాధి ఏర్పాటు చేసి.. అక్కడ ఆమె గుర్తుగా.. ఓ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు.

కాగా.. ఈ కార్యక్రమానికి సీఎం యోగి ఆదిత్యానాథ్ రావాలని కోరుకుంటున్నట్లు.. లేకుంటే.. ఖననం జరిగే సమస్యే లేదంటూ.. బాధితురాలి తండ్రి తెలిపారు. అలాగే.. వారి కుటుంబంలో.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో.. కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు సదరు అధికారులు. అలాగే.. లక్నో ఐజీ ఎస్‌కే భగత్‌ను ఉన్నావ్‌లో ఉండాలని.. డీజీపీ ఓసీ సీంగ్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని సూచించారు. శుక్రవారం బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా.. బెయిల్‌పై వచ్చిన నిందితులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాగా.. 90 శాతం కాలిన గాయాలతో.. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.