వారిని ఢిల్లీ తీసుకురావొద్దు…సుప్రీం తాజా ఆదేశాలు

ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఆమెతో పాటు ఆమె లాయర్ కూడా ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరికి లక్నోలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లోనే చికిత్స కొనసాగించాలని ఆదేశించింది. మరోవైపు బాధితురాలకి రూ.25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలతో.. దాన్ని చెల్లించినట్టుగా యూపీ ప్రభుత్వం తెలిపింది. రాయ్‌బరేలీ జైల్లో ఉన్న బాధితురాలి చిన్నాన్నను తీహార్ జైలుకు తరలించాలని, ఆమెకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:04 pm, Fri, 2 August 19

ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఆమెతో పాటు ఆమె లాయర్ కూడా ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరికి లక్నోలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లోనే చికిత్స కొనసాగించాలని ఆదేశించింది. మరోవైపు బాధితురాలకి రూ.25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలతో.. దాన్ని చెల్లించినట్టుగా యూపీ ప్రభుత్వం తెలిపింది.

రాయ్‌బరేలీ జైల్లో ఉన్న బాధితురాలి చిన్నాన్నను తీహార్ జైలుకు తరలించాలని, ఆమెకు సంబంధించిన వివరాలు ఎక్కడ వెల్లడించవద్దని మీడియాకు సైతం ఆదేశాలు జారీచేసింది. బాధితురాలి చిన్నాన్న రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు సోమవారం మరోసారి విచారించనుంది.