Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

ఉన్నావ్ రేప్ కేసు.. కుల్ దీప్ సెంగార్ కు యావజ్జీవ శిక్ష ?

Delhi court convicts ex-BJP, ఉన్నావ్ రేప్ కేసు.. కుల్ దీప్ సెంగార్ కు యావజ్జీవ శిక్ష ?

యూపీలోని ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ ని ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టు దోషిగా ప్రకటించింది. 2017 లో నాడు మైనర్ గా ఉన్న బాలికను ఇతగాడు కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడన్నది ప్రధాన ఆరోపణ. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 120 బీ, 363, 366, 376 సెక్షన్ల కింద, మైనర్ బాలికలపై లైంగిక నేరాల అదుపునకు సంబంధించిన ‘ పోక్సో ‘ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఇతడ్ని దోషిగా జడ్జి ధర్మేష్ శర్మ ప్రకటించారు.

యూపీలోని బంగేర్మవు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సెంగార్ ని కమలం పార్టీ గత ఆగస్టులో బహిష్కరించింది. అయితే ఈ కేసులో ఇతని సహ నిందితుడు శశిసింగ్ ని కోర్టు అన్ని అభియోగాలనుంచి నిర్దోషిగా విడిచిపుచ్చింది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చాలా జాప్యం చేసిందని కోర్టు విమర్శించింది. ఇన్వెస్టిగేషన్ లో ఈ సంస్థ.. ప్రాసిక్యూషన్ కు సంబంధించి మాన్యువల్ పాటించలేదని తప్పు పట్టింది. ఈ నేరం తాలూకు సమాచారాన్ని చాలా ఆలస్యంగా పోలీసులకు తెలిపారన్న డిఫెన్స్ వాదనను తోసిపుచ్చింది. పైగా బాధితురాలి బంధువు కావాలనే ఆలస్యంగా ఫిర్యాదు చేశారన్న వాదనను సైతం న్యాయమూర్తి తిరస్కరించారు. తనకు, తన కుటుంబానికి సెంగార్ నుంచి హాని ఉందని భయపడిన బాధితురాలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నోలోని ఓ సెషన్స్ కోర్టు నుంచి ఢిల్లీ తిస్ హజారీ కోర్టుకు బదిలీ అయిన ఈ కేసును న్యాయమూర్తి రోజువారీ ప్రాతిపదికపై విచారించారు. ‘ఈ కేసులో దోషికి ఎంతకాలం, ఏమేరకు శిక్ష విధించాలన్న అంశంపై మంగళవారం లేదా బుధవారం కోర్టు వాదనలను ఆలకించవచ్ఛు.

గరిష్టంగా సెంగార్ కు యావజ్జీవ శిక్ష విధించవచ్చునని భావిస్తున్నారు.

2017 లో నాడు 16 ఏళ్ళ మైనర్ అయిన బాధితురాలిని సెంగార్ కిడ్నాప్ చేసి, రేప్ చేశాడని, ఇది నిరూపితమైందని కోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ కోర్టులో రహస్యంగా జరగడం విశేషం. బార్ అండ్ బెంచ్ కథనం ప్రకారం.. సెంగార్ ను దోషిగా ప్రకటించిన న్యాయస్థానం.. నేరం జరిగిన స్థలం వద్ద తాను లేనన్న అతని వాదనను తోసిపుచ్చింది.
తీర్పును చదివిన జడ్జి ధర్మేష్ శర్మ.. బాధితురాలి స్టేట్ మెంట్ నిజమేనని, ఆమెపై అత్యాచారం జరిగిందని నమ్ముతున్నానని అన్నారు. తనకు, తన కుటుంబానికి హాని జరుగుతుందని బాధితురాలు భయపడిందని ఆయన పేర్కొన్నారు. ఈమె ఓ గ్రామీణ బాలిక.. కాస్మోపాలిటన్ ప్రాంతానికి చెందినది కాదు.. పైగా పెద్ద చదువుకున్నది కూడా కాదు.. అయితే.. సెంగార్ పలుకుబడి గల వ్యక్తి.. పవర్ ఫుల్ పర్సన్.. అందుకే ఆమె భయపడి అతనిపై ఫిర్యాదు చేయడానికి ఎంతోకాలం తీసుకుంది. అని ఆయన వ్యాఖ్యానించారు. బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు లేఖ రాశాక.. ఆమె కుటుంబంపై ఎన్నో క్రిమినల్ కేసులు దాఖలయ్యాయని, వాటిలో దోషి వేలిముద్రలు కనిపించాయని కోర్టు తెలిపింది.
జులై 28 న బాధితురాలు కారులో ప్రయాణిస్తుండగా ఆ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆమె కుటుంబంలోని ఇద్దరు మహిళలు మృతి చెందారు. సెంగారే ఈ ప్రమాదం చేయించాడని అనుమానిస్తున్నామని బాధితురాలి కుటుంబం ఆరోపించింది.
బాధితురాలి తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో ఇరికించి గత ఏడాది ఏప్రిల్ మూడో తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అయితే జ్యూడిషియల్ కస్టడీలో ఉండగా ఏప్రిల్ 9 న ఆయన మరణించాడు. ఇలా దేశ వ్యాప్త సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సెంగార్ కు కోర్టు యావజ్జీవ ఖైదు విధించవచ్చునని అంటున్నారు.