Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

రేప్‌ ఘటనలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

Unnao incident shames entire humanity Says Rahul Gandhi, రేప్‌ ఘటనలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

దేశంలో పెరుగుతున్న అత్యాచారాలపై.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన దిశ, ఉన్నావ్ ఘటనలపై స్పందించారు. కేరళలోని వయనాడ్‌లో పర్యటనలో ఉన్న ఆయన.. ఉన్నావ్ రేప్ ఘటన బాధితురాలి మృతిపట్ల తీవ్రంగా స్పందించారు. భారతదేశం మరో కూతురును కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో జరుగుతున్న రేప్ ఘటనలకు.. భారత్ రాజధానిగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరుగుతున్న వరుస రేప్‌ ఘటనల పట్ల ప్రపంచ దేశాలు మొత్తం మన భారత్‌వైపే చూస్తున్నాయన్న ఆయన.. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట రేప్‌లు, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉందని.. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.