అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్ 5.0.. కొత్త‌గా వేటికి అనుమ‌తి ఇవ్వొచ్చంటే.?

దేశవ్యాప్తంగా రేపటితో అన్‌లాక్ 4.0 గడువు ముగియనుంది. దీనితో అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్ 5.0 ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ అన్‌లాక్ 5.0లో వేటికి అనుమతి ఇవ్వొచ్చు.? నిబంధనలు ఏంటి.? ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.? అనే వివరాలపై ఇవాళ లేదా రేపు కేంద్రం నుంచి గైడ్‌లైన్స్ వెలువడే అవకాశముంది. త్వరలోనే ముఖ్యమైన దసరా, దీపావళి పండగలు ఉండటంతో కేంద్రం ప్రత్యేకంగా వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశాలు […]

  • Ravi Kiran
  • Publish Date - 9:20 am, Tue, 29 September 20

దేశవ్యాప్తంగా రేపటితో అన్‌లాక్ 4.0 గడువు ముగియనుంది. దీనితో అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్ 5.0 ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ అన్‌లాక్ 5.0లో వేటికి అనుమతి ఇవ్వొచ్చు.? నిబంధనలు ఏంటి.? ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.? అనే వివరాలపై ఇవాళ లేదా రేపు కేంద్రం నుంచి గైడ్‌లైన్స్ వెలువడే అవకాశముంది. త్వరలోనే ముఖ్యమైన దసరా, దీపావళి పండగలు ఉండటంతో కేంద్రం ప్రత్యేకంగా వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. (Unlock 5.0)

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన అన్‌లాక్ 4.0లో మెట్రో సేవలను తిరిగి ప్రారంభించడం, 9-12 తరగతులకు పాఠశాలలను పాక్షికంగా తెరవడం వంటి మినహాయింపులను కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. గత వారం ఏడు కరోనా ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా నియంత్రణలో భాగంగా ‘మైక్రో కంటైన్మెంట్’ జోన్ల ఆలోచనను అమలు చేయాలని సూచించారు.

ఇప్పటికే మాల్స్, సెలూన్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు వంటి బహిరంగ ప్రదేశాలను పలు ఆంక్షలతో తెరిచేందుకు అనుమతించిన కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ).. అక్టోబర్‌లో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే 50 శాతం అంతకంటే తక్కువ సామర్ధ్యంతో సినిమా థియేటర్లకు అనుమతించే అవకాశముండగా.. పర్యాటక ప్రదేశాలకు యాత్రికులను అనుమతించే అవకాశముంది. కాగా, అక్టోబర్‌లో కూడా విద్యాసంస్థల్లో మరిన్ని తరగతులను వాలంటీరీ బేసిస్‌లో తెరిచేందుకు అనుమతించే అవకాశం ఉందని సమాచారం.

Also Read:

నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి పీహెచ్‌డీ అడ్మిషన్లు..

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. రూ. 35 వరకు పెరగనున్న టికెట్ ధర!