అన్‌లాక్ 2.0: అంతర్రాష్ట్ర ప్రయాణాలకు పర్మిషన్ అక్కర్లేదు.!

ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు పెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, రాష్ట్ర పరిధిలోని ఒక చోటు నుంచి...

అన్‌లాక్ 2.0: అంతర్రాష్ట్ర ప్రయాణాలకు పర్మిషన్ అక్కర్లేదు.!
Follow us

|

Updated on: Jun 30, 2020 | 8:40 AM

అన్‌లాక్ 1.0 ముగిసింది. రేపటి నుంచి అన్‌లాక్ 2.0 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి దానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సడలించింది. అటు కంటైన్‌మెంట్ జోన్లలో కేవలం అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతించింది.

ఇదిలా ఉంటే ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు పెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, రాష్ట్ర పరిధిలోని ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడానికి ప్రయాణీకులపై, నిత్యావసర సరుకుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణీకులకు ఎలాంటి అనుమతులు, ఈ పర్మిట్లు అవసరం లేదంది. అటు కర్ఫ్యూ సమయంలో బస్సులు, రైళ్లు దిగి గమ్యస్థాలాలకు చేరుకునే జనాలను సైతం అడ్డుకోవద్దని సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల ఆంక్షలు విధించుకునే స్వేచ్ఛ ఉందని ప్రకటించింది. కాగా, ఈ నిబంధనలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి.

Also Read: ఆ 5 లక్షల మందికి ‘రైతు బంద్’.. తెలంగాణ సర్కార్ నిర్ణయం..