నరసింహన్ లా కాదు.. ఆమె రూటే సెపరేటట..

unlike narasimhan new governor does not go to temples daily, నరసింహన్ లా కాదు.. ఆమె రూటే సెపరేటట..

తెలంగాణ గవర్నర్ గా వైదొలుగుతున్న నరసింహన్ కు టీఆరెస్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకనుంది. ఆయన స్థానే నూతన గవర్నర్ గా రానున్న తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ కు ఆర్భాటంగా స్వాగతం పలకబోతోంది. ఈ నేపథ్యంలో.. గవర్నర్ గా నరసింహన్ ఈ పదేళ్ల కాలంలో వారు ఎన్నోగుడులు, ఆలయాలను సందర్శించిన వైనాన్ని ఆయన సెక్యూరిటీ గుర్తు చేసుకుంటోంది. 2009 లో నరసింహన్ తన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఇప్పటివరకు తిరుమలలో 100 కు పైగా శీవారి దర్శనాలు చేసుకున్నట్టు అంచనా.. అలాగే ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలకు, ఇతర కార్యక్రమాలకు లెక్కలేనన్ని సార్లు ఆయన హాజరవుతూ వచ్చారు. హైదరాబాద్ సిటీలో ప్రధాన ఆలయాలను ఇంచుమించు నరసింహన్ దంపతులు విజిట్ చేస్తూ ఉంటారని, దీనివల్ల వాహనదారులకు ఇబ్బంది కలగడమే కాక, ట్రాఫిక్ జామ్ లు తప్పేవి కావని వారంటున్నారు. అలాగే నరసింహన్ గుడులకు వెళ్ళినప్పుడల్లా భక్తుల’ పరేషాన్ ‘ అంతాఇంతా కాదు.. వారిని గంటలకొద్దీ నిలిపివేసేవారని, తాము కూడా అత్యంత జాగరూకతతో నరసింహన్ దంపతులకు భద్రత కల్పించవలసి వచ్ఛేదని ఆయన ప్రధాన సెక్యూరిటీ అధికారులు ఓ ఇంగ్లీష్ డైలీకి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రానికి రానున్న కొత్త గవర్నర్ సౌందరరాజన్ కు రోజూ ఆలయాలను సందర్శించే అలవాటు లేదని తెలిసి తాము కాస్త రిలీఫ్ ఫీలవుతున్నామని వారు ‘ నిబ్బరంగా ‘ పేర్కొన్నారు. రాజ్ భవన్ లో ఆమె నిత్యం బహుశా పొలిటికల్ లీడర్లు, ఇతర నేతలు, సెలబ్రిటీలను కలుసుకొవచ్చునని, అలాగే ప్రభుత్వ, ప్రయివేటు ఈవెంట్లకు ఆమె హాజరు కావచ్ఛునని భావిస్తున్నామని అంటున్నారు. మొదటి నుంచీ రాజకీయ నేతగా ఉన్న ఆమె మంచి ఆరేటర్ కూడా.. ఈ దృష్ట్యా..గవర్నర్ గా సౌందరరాజన్ ‘ తీరు ‘ పూర్తి వేరుగా ఉండగలదని అనుకుంటున్నామని రాజ్ భవన్ సెక్యూరిటీ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *