గుంటూరులో రెచ్చిపోయిన దుండుగులు.. 13 బైక్‌లకు నిప్పు

Unknown people set 13 bikes on fire in Guntur, గుంటూరులో రెచ్చిపోయిన దుండుగులు.. 13 బైక్‌లకు నిప్పు

గుంటూరులో దుండగులు రెచ్చిపోయారు. ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన టూ వీలర్‌ వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 13 బైక్‌లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన గుంటూరు శివార్లలోని నల్లచెరువు వద్ద చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. నిన్న అర్ధరాత్రి నల్లచెరువు ప్రాంతానికి చేరుకుని.. ఇళ్ల బయట పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో బైక్‌లన్నీ కాలి బూడిదయ్యాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *