Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

పొంచివున్న జలప్రళయం.. ఐరాస నివేదిక హెచ్చరిక

United Nations Latest Report, పొంచివున్న జలప్రళయం.. ఐరాస నివేదిక హెచ్చరిక

భూతలానికి పెను గండం రాబోతోంది. రాబోతున్న కాలంలో నగరానికి ఆనుకుని ఉన్న సాగరాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయని ఐరాస ముసాయిదా నివేదిక చెబుతోంది. సముద్ర మట్టాలు పెరిగిపోయి, తీర ప్రాంతం వెంబడి ఉన్న అనేక మహానగరాల్లో జలప్రళయం తప్పదని, కోట్ల మంది నిరాశ్రయులవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. కరుగుతున్న మంచు కారణంగా ప్రధానంగా చైనా, అమెరికా, ఐరోపా, భారత్‌లకు ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది. సాగర తీరాలు పెరగడంతో భారత నగరాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఐరాసకు చెందిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ఈ నివేదికను తయారు చేయడం ఈ సంవత్సరంలో ఇది నాలుగోసారి.

కేవలం భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించడం, అడవులు, ప్రపంచ ఆహార వ్యవస్థ వంటి అంశాల గురించి మాత్రమే ఇంతకు ముందున్న నివేదికలు తెలిపాయి. అయితే ఇలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండాలంటే ప్రజల జీవన శైలిలో మార్పు రావాలి. క్లైమేట్ చేంజ్ పై ప్రపంచ దేశాలు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలి. గ్లోబల్ హీట్ ను తగ్గించడానికి తప్పనిసరిగా పూనుకోవలిసిందే. హిమాలయాలతో సహా అంటార్కిటికా వంటి ఖండాల్లో మంచు క్రమేపి కరిగిపోతూ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంతో ఈ నివేదిక రూపకల్పన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తాజాగా సిద్ధమైన నివేదికను పరిశీలించడానికి సెప్టెంబర్‌లో ప్రపంచ దేశాల ప్రతినిధులు మొనాకోలో సమావేశం కానున్నారు. ఐపీసీసీ నివేదిక ప్రకారం భారత్‌లో విధ్వంసకర మార్పులు ఇప్పటికే ఆరంభమయ్యాయని తెలుస్తోంది. మత్స్య సంపద క్రమంగా తగ్గిపోతుండటం ఉదాహరణగా తెలుస్తోంది. ఇక తుఫాను వల్ల కలిగే నష్టం వంద రెట్లు కన్నా ఎక్కువగా పెరుగుతోంది.

Related Tags