కాంగ్రెస్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. చైనా నుంచి వచ్చే నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్‌ ట్రస్ట్ కు చైనా ఎంబసీ నుంచి భారీగా నిధులు ముట్టుతున్నాయన్నారు.

కాంగ్రెస్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 5:42 PM

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. చైనా నుంచి వచ్చే నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్‌ ట్రస్ట్ కు చైనా ఎంబసీ నుంచి భారీగా నిధులు ముట్టుతున్నాయన్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీనేతలు చైనాకు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చైనాతో కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ఉన్న సంబంధాలను వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్‌, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు అధికార బీజేపీ నిర్లక్ష్యమే కారణమంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్న నేపధ్యంలో అందుకు ధీటుగా అధికార పార్టీ సమాధానమిస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి సంబంధించి కూడా కాంగ్రెస్‌ పార్టీపై రవిశంకర్‌ ప్రసాద్‌ ఘాటుగానే స్పందించారు. ప్రధాని సీటును కాపాడుకోవడానికే 1975 జూన్‌ 25న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిందని కేంద్రమంత్రి ఆరోపించారు. దేశ చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్‌ నారాయణ్‌, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, చంద్రశేఖర్‌ వంటి ప్రముఖ నాయకులతో పాటు లక్షలాది మంది ప్రజలను నిరాధారంగా అరెస్ట్‌ చేశారన్నారు. 1977 తర్వాత కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక ప్రవర్తనకు వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ సారథ్యంలో బిహార్‌ నుంచి ఓ కార్యకర్తగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడడం నా అదృష్టం అని ట్విటర్‌లో పేర్కొన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!