ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుల కార్పొరేటీకరణ – నిర్మలా

కరోనా ప్రభావంతో కుదేలైన భారత్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇందు భాగంగా రక్షణ రంగంలో పలు సంస్కరణలను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగానికి అవసరమైన వాటిని భారత్‌లోనే తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటి వరకు దిగుమతి చేసుకుంటున్న వాటిని మెల్లమెల్లగా తగ్గిస్తామన్నారు. ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే వాటి సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో దిగుమతి ఖర్చు భారీగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక […]

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుల కార్పొరేటీకరణ - నిర్మలా
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:23 PM

కరోనా ప్రభావంతో కుదేలైన భారత్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇందు భాగంగా రక్షణ రంగంలో పలు సంస్కరణలను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగానికి అవసరమైన వాటిని భారత్‌లోనే తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటి వరకు దిగుమతి చేసుకుంటున్న వాటిని మెల్లమెల్లగా తగ్గిస్తామన్నారు. ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే వాటి సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో దిగుమతి ఖర్చు భారీగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులను కార్పొరేటీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పొరేటీకరణ అంటే ప్రైవేటీకరణ కాదన్న నిర్మలా.. బెస్ట్‌ మేనేజింగ్ వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రజలు స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఇక రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.