రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం రెడీ, డిసెంబరు 3 న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలతో చర్చలకు  కేంద్రం  సుముఖత వ్యక్తం చేసింది. సహనంతో ఉండాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.

రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం రెడీ, డిసెంబరు 3 న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2020 | 1:07 PM

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలతో చర్చలకు  కేంద్రం  సుముఖత వ్యక్తం చేసింది. సహనంతో ఉండాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. డిసెంబరు 3 న వివిధ రైతు సంఘాల ప్రతిధులతో చర్చలు జరుపుతామని ఆయన ప్రకటించారు. గతంలో కూడా తాము సంప్రదింపులు జరిపామని, ఇంకా ఇందుకు రెడీగా ఉన్నామని ఆయన చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన అన్నారు.  వీరి సమస్యలను తమ రాజకీయ ప్రయోజనాలకు కాంగ్రెస్ సహా విపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని తోమర్ ఆరోపించారు. కాగా ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వ శాఖ 32 రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.ఇలా ఉండగా రైతు చట్టాలను పార్లమెంటు ఆమోదించిన అనంతరం కూడా వివిద రైతు సంఘాలు వీటిని నిరసిస్తూ ఆందోళనకు దిగగా అప్పుడు కూడా వీరిని కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. వీరు వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయానికి చేరుకోగా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చల్లో పాల్గొనకుండా గైర్ హాజరయ్యారు. తమ శాఖ కార్యదర్శి చర్చలు జరుపుతారని ప్రకటించారు. అయితే రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహించి..స్వయంగా మంత్రే రావాలంటూ డిమాండ్ చేసిన విషయం గమనార్హం. ఆ కార్యాలయంలోనే వారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెనక్కి మళ్లారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తరాదని అన్నదాతలు అంటున్నారు. తమ సమస్యలను బీజేపీ కూడా రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు.

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!

ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!