కేంద్రమంత్రి సమక్షంలో కనిపించని లాక్‌డౌన్ నిబంధనలు..!

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారీని కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్రం సర్కార్. కానీ మధ్యప్రదేశ్ లో కేంద్రమంత్రి సమక్షంలో లాక్‌డౌన్ నిబంధనలు విస్మరించారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం కేంద్ర ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని, త‌ర‌చూ చేతుల‌ను శుభ్రం చేసుకోవాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌జ‌ల‌ను ఆదేశించింది. గ‌త రెండు నెల‌లుగా దేశ‌మంత‌టా ఈ నియ‌మాలు […]

కేంద్రమంత్రి సమక్షంలో కనిపించని లాక్‌డౌన్ నిబంధనలు..!
Follow us

|

Updated on: May 27, 2020 | 4:40 PM

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారీని కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్రం సర్కార్. కానీ మధ్యప్రదేశ్ లో కేంద్రమంత్రి సమక్షంలో లాక్‌డౌన్ నిబంధనలు విస్మరించారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం కేంద్ర ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని, త‌ర‌చూ చేతుల‌ను శుభ్రం చేసుకోవాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌జ‌ల‌ను ఆదేశించింది. గ‌త రెండు నెల‌లుగా దేశ‌మంత‌టా ఈ నియ‌మాలు అమ‌లవుతున్నాయి. అయితే, మధ్యప్రదేశ్ లో మాత్రం జనం గుంపులు గుంపులుగా రోడ్డెక్కుతున్నారు. బుధ‌వారం కేంద్రమంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్ జిల్లాను సంద‌ర్శించారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలో ఎన‌లేని కృషిచేస్తున్న హెల్త్‌వ‌ర్క‌ర్ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగే ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న‌ను జ‌నం గుంపులుగా చుట్టుముట్టారు. పోటీప‌డి విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సామాజిక దూరం నిబంధ‌న‌ను పూర్తిగా తుంగ‌లో తొక్కారు. కనీసం మొఖాల‌కు మాస్కులు ధ‌రించాలన్న విషయం కూడా మర్చిపోయారు. కేంద్ర‌మంత్రి సాక్షిగా ఈ ఉల్లంఘ‌న జ‌రగ‌డంతో పలువురు నెజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..