అభినందించకుండా నిందలు వేస్తారా? .. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ఫైర్

Union minister Kishanreddy on Article 370 abrogation, అభినందించకుండా నిందలు వేస్తారా? .. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ఫైర్

జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు బిల్లు అమలులో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. అధికారంలోకి రాగానే ఆర్టికల్370ని రద్దు చేస్తామని ఆనాడే చెప్పామని తాము మాట నిలుపుకున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు అది అమలు జరగడం వల్ల అక్కడ విద్యాహక్కు చట్టం వర్తించలేదన్నారు. దేశంలో అమలవుతున్న ఎన్నోచట్టాలు అక్కడ అమలు కాలేదన్నారు కిషన్‌రెడ్డి. రెండు ప్రభుత్వాలు, రెండు ప్రధానులు ఉండకూడదన్నది తమ పార్టీ విధానమన్నారు. 70ఏళ్ళుగా ఈ ఆర్టీకల్ 370 అమలు కావడం కాంగ్రెస్ పాపమేనని,ఇన్నాళ్ళు ప్రజల హక్కులను హరిస్తుంటే ఎవరూ నోరు మెదపలేదని విమర్శించారు. ప్రస్తుతం కశ్మీర్‌లో టూ జీ.. త్రీ జీ పనిచేయడం లేదని గగ్గోలు పెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శించారు. ఒక్క బుల్లెట్ గానీ.. ఒక్క బాష్పవాయువు గోళం కాల్చకుండా .. ఎంలాంటి ఆందోళనలు జరగకుండా జమ్ముకశ్మీర్‌ విషయంలో ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే అభినందించకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *