గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆదివారం ఉదయం తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు అందుతున్న వైద్యసదుపాయాలపై ఆరా తీశారు.

గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 12, 2020 | 10:07 AM

ప్రజా ప్రతినిధులు కోవిడ్ బారిన పడితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రజల్లో నమ్మకం కలిగించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. గాంధీ పై ప్రజల్లో విశ్వసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆదివారం ఉదయం తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు అందుతున్న వైద్యసదుపాయాలపై ఆరా తీశారు. ఇప్పటికే 600 వెంటిలేటర్స్ తెలంగాణ కు ఇచ్చామని.. కరోనా కట్టడికి రాష్ట్రానికి ఎలాంటి సహాయం కావాలన్నా కేంద్ర మంత్రిగా సహాయం చేస్తానన్నారు. గచ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని కిషన్ రెడ్డి సూచించారు. కాగా.. తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పెరిగిపోతోంది.