Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 46 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 246628 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 120406 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 119293 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6929 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తిరుపతి: రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం. ఎనభై రోజుల తరవాత ప్రారంభమవుతున్న దర్శనాలు. రేపు ఎల్లుండి ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు. పదో తేదీ తిరుమల పై ఉన్న స్థానికులకు దర్శనాలు. 11వతీదీ నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం. జూన్ నెలకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు రేపటి నుంచి టిటిడి వెబ్ సైట్ లో లభ్యం. ఆఫ్ లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో టికెట్లు లభ్యం. అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు వెళ్లేందుకు అనుమతి. కాణిపాకం దేవాలయంలో రేపటి నుంచి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్. పదో తేదీ నుంచి గంటకు మూడువందలమంది వరకూ భక్తులకు దర్శనాలు. శ్రీకాళహస్తిలో దేవాలయం రెడ్ జోన్ లో ఉండటం వల్ల ప్రస్తుతానికి దర్శనాలు ప్రారంభించడం లేదని ప్రకటించిన అధికారులు.
  • నిమ్స్ లోని 5 విభాగాలు 7 నుండి9 వ తేదీ వరకు ముత పడనున్నాయ్. పాజిటివ్ వచ్చిన వారూ పనిచేసిన విభాగాలను శానిటేషన్ చేయనున్న హాస్పిటల్ సిబ్బంది ghmc. ముత పడనున్న 5 విభాగాలు: మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ.
  • గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం గందరగోళంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... గ్రేటర్ లోనే సగంమంది 10th విద్యార్థులు. సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్ . అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలనే యోచలనలో ప్రభుత్వం.
  • విజయవాడ: గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో విచారణ.. సందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు.. ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డి డి నాగబాబులను విచారిస్తున్న పోలీసులు.. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడిసీటర్ల ఉన్నట్టు గుర్తింపు.. టెక్నాలజీ సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల పండు తల్లిని పాత్రపై విచారిస్తున్న పోలీసులు..
  • అమరావతి: ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. 18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం. ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.

కేంద్ర మంత్రే కానీ ఢిల్లీ ఇల్లు లేదు.. ఎందుకో తెలుసా ?

Telangana BJP Leader Kishan Reddy, కేంద్ర మంత్రే  కానీ ఢిల్లీ ఇల్లు లేదు.. ఎందుకో తెలుసా ?

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడాయన.. కానీ లక్ కలిసొస్తే ఎలా ఉంటుందో చూపేందుకు ఆయనకు 6 నెలలే పట్టింది.. ఇంతలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి.. సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయకు వయసు అడ్డొచ్చింది.. లక్ కిషన్ రెడ్డికి కల్సి వచ్చింది.. కట్ చేస్తే చకచకా ఎన్నికలు పూర్తవడం నరేంద్ర మోదీ హవాలో బంపర్ మెజారిటీతో ఎంపీగా గెల్చి హస్తినాపురికి వెళ్లడం అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోయాయి.. అదృష్టం అంతటితో ఆగిందా అంటే ఆగలేదు.. తొలిసారి ఎంపీగా ఎన్నికవడమే తరువాయి.. మోదీ, అమిత్ షాల అండదండలతో కేంద్ర మంత్రిగా కూడా అయిపోయారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. నవంబర్, 2018 లో ఘోరమైన ఓటమితో సిటీలో తిరిగేందుకు జంకిన వ్యక్తిని.. మే, 2019 చివరి నాటికి ఏకంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ లో దిగే స్థాయికి చేర్చింది ఖచ్చితంగా అదృష్టమే అంటే కాదనే వారే లేరు. అఫ్ కోర్స్… అయన సుదీర్ఘ కలం పార్టీకి చేసిన సేవ కూడా ఇందులో కీలకమే అనుకోండి..
అయితే కథ ఇక్కడితో ఆగలేదు..

కేంద్ర మంత్రి వర్గం లో చేరడం.. అమిత్ షాకు అనుబంధంగా కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆలా చకచకా జరిగిపోయాయి.. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది… కేంద్ర మంత్రి అవడం వరకు బాగానే ఉంది.. కానీ ఢిల్లీ లో ఈ మంత్రికి గారికి ఉండేందుకు ఇల్లే కరువైంది..నిజానికి కిషన్ రెడ్డికి తుగ్లక్ క్రెసెంట్ రోడ్ లో మినిస్టర్ బంగ్లాని కేటాయించారు. కానీ ఆ ఇంట్లో మాజీ కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఉంటున్నారు. తనకు వేరే బంగ్లా కేటాయించాలని సిన్హా పట్టణాభివృద్ధి శాఖాధికారులను ఇది వరకే కోరారు. దాంతో సిన్హాకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ ను కేటాయించింది పట్టణాభివృద్ధికి శాఖా. కానీ ఆ ఇంట్లో బీజేపీ సీనియర్ నేత రాధామోహన్ సింగ్ ఉంటున్నారు. అటు రాధామోహన్ సింగ్ ఇల్లు ఖాళీ చేయరు.. ఇటు సిన్హా తన బంగ్లాని ఖాళీ చేసి రాధామోహన్ సింగ్ ఇంటికి మారరు. సో కిషన్ రెడ్డికి ఏపీ భావనే దిక్కైంది. అక్కడ్నించి అయన కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. నిజానికి మే 25 న కొత్త లోక్ సభ ఏర్పాటైంది. జూన్ 25 నాటికి మాజీ లంతా క్వార్టర్స్ ఖాళీ చేయాల్సి ఉంది.. కానీ ఇది జరగకపోవడం తో కిషన్ రెడ్డి లాంటి వారు ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తోందని సమాచారం. ఖాళీ చేయని వారిలో కమల నాథులే ఎక్కువగా ఉండడంతో వారిపై ఒత్తిడి తేలేక.. పాపం కిషన్ రెడ్డి ఇలా సర్దుకుపోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.. ప్చ్.. పాపం కిషన్ రెడ్డికి ఈ అవస్థలు ఎన్నాళ్ళో ?

Related Tags