అమరావతి ఆందోళనలపై ఏపీ డీజీపీకి కేంద్ర మంత్రి ఫోన్

రాజధానిగా అమరావతిని తరలించొద్దంటూ గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ స్పష్టతను ఇవ్వకపోగా.. రోజు రోజుకు ఆందోళనల తీవ్రత ఎక్కువవుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల మోహరించారు. జేఏసీ నేతల ర్యాలీలు, ఆందోళనకారుల అరెస్ట్‌లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమరావతిలో పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ […]

అమరావతి ఆందోళనలపై ఏపీ డీజీపీకి కేంద్ర మంత్రి ఫోన్
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 10:06 AM

రాజధానిగా అమరావతిని తరలించొద్దంటూ గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ స్పష్టతను ఇవ్వకపోగా.. రోజు రోజుకు ఆందోళనల తీవ్రత ఎక్కువవుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల మోహరించారు. జేఏసీ నేతల ర్యాలీలు, ఆందోళనకారుల అరెస్ట్‌లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమరావతిలో పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. అమరావతిలో రైతులు ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఏపీ మూడు రాజధానుల అంశం ఇంకా కేంద్రం దృష్టికి రాలేదని ఇటీవల కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కాగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలిపేందుకు రైతులు పరదాలు వేయగా.. పోలీసులు పరదాలను లాగేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్, యాక్ట్ 30 అమల్లో ఉందని.. అందుకే నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం