ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రశంస

ఇండియన్‌ టీబీ రిపోర్టు–2020 విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ . వర్చువల్ ఈవెంట్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలోఈ నివేదికను విడుదల చేసిసన మంత్రి. క్షయ నివారణకు ఏపీ ప్రభుత్వానికి మంత్రి ప్రశంస.

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రశంస
Follow us

|

Updated on: Jun 24, 2020 | 7:20 PM

దేశంలో క్షయ విస్తరణ కొనసాగుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాదితో పోల్చితే 14 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే టీబీ వ్యాధి నివారణలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానం సాధించడంపట్ల కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ అభినందించారు.

భారతదేశంలో క్షయ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇండియన్‌ టీబీ రిపోర్టు–2020 పేరుతో బుధవారం విడుదల చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24.04 లక్షల మంది టీబీతో బాధపడుతున్నారని మంత్రి తెలిపారు. 2018తో పోలిస్తే ఇది 14శాతం పెరిగిందన్న ఆయన.. 2025 నాటికి టీబీ రహిత దేశమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. క్షయ వ్యాధి నివారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న చొరవను ఆయన కొనియాడారు. టీబీ నివారణా ప్రోగ్రాం లో 2019 సంవత్సరానికి గాను దేశంలో ఏపీకి రెండో స్థానం దక్కింది. ఈ సందర్భంగా 2019లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ప్రశంసా పత్రాల్ని అందజేసిన కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి.