జరిమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవచ్చు : కేంద్రమంత్రి గడ్కరీ

Union Minister Gadkari on New motor vehicle Act 2019, జరిమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవచ్చు : కేంద్రమంత్రి గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ జరిమానాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరణ ఇచ్చారు. ప్రాణం కంటే ఫైన్ ఎక్కవ కాదన్నారు. కేంద్రం జరిమానాలను పెంచుతూ చట్ట సవరణ చేసినా… ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్నారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాలను 50 శాతం తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం 2019 ప్రకారం జరిమానాలు తగ్గించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేశారు.

దేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలు పెరగుతూనే ఉన్నాయని, దాదాపు లక్షా 50 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ విధంగా జరిమానాలు విధించడం వల్ల వాహనదారుల్లో అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఫైన్ చెల్లించడం కంటే ప్రాణం విలువైందని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తే ఫైన్ కట్టాల్సిన అవసరం రాదుకదా అంటూ వ్యాఖ్యానించారు మంత్రి గడ్కరీ.  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్ల అమ్మకాలపై చేసిన వ్యాఖ్యల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదని, మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశించడంతో సంప్రదాయ ఇందనంతో నడిచే వాహనాల అమ్మకాలు పడిపోయాయని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *