ఆంక్షలు అక్కడ లేవు.. మీ మనసుల్లోనే ఉన్నాయి : హోం మంత్రి అమిత్ షా

కశ్మీర్‌లో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఇలాంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రపంచ దేశాలు అభినందించాయని, ఇది భారత్ అంతర్గత సమస్యగా అభివర్ణించాయని  ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి తెరతీశాయని మండిపడ్డారు. కశ్మీర్‌లోని 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు ఉన్న నిషేధా […]

ఆంక్షలు అక్కడ లేవు.. మీ మనసుల్లోనే ఉన్నాయి : హోం మంత్రి అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 12:21 AM

కశ్మీర్‌లో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఇలాంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రపంచ దేశాలు అభినందించాయని, ఇది భారత్ అంతర్గత సమస్యగా అభివర్ణించాయని  ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి తెరతీశాయని మండిపడ్డారు. కశ్మీర్‌లోని 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు ఉన్న నిషేధా ఉత్తర్వులను ఎత్తివేశామని, కేవలం 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో మాత్రం ఈ ఉత్తర్వులు కొనసాగుతున్నాయన్నారు.

” ఆంక్షలు కేవలం మీ మనసులో మాత్రమే ఉన్నాయి. కానీ జమ్ము కశ్మీర్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయనే సమాచారం మాత్రం వ్యాపిస్తోంది. కశ్మీర్‌లో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. ఎక్కడికైన వెళ్లగలుగుతున్నారు. జర్నలిస్టులు కూడా క్రమం తప్పకుండా కశ్మీర్‌ను చూసి వస్తున్నారు’ అంటూ అమిత్ ప్రసంగించారు.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతం కావడంతో హోం మంత్రి మాట్లాడుతూ ప్రధాని ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించినప్పుడు ఆర్టికల్ 370 రద్దుపై ప్రపంచ నేతలంతా మద్దతు పలికారని, ప్రపంచ నాయకులంతా ఏడు రోజుల పాటు న్యూయార్క్‌లో సమావేశమైనప్పటికీ.. అందులో ఏ ఒక్క నాయకుడు జమ్ము కశ్మీర్ విషయంలో భారత్‌ను ప్రశ్నించలేకపోయారని, ఇది మన ప్రధాన మంత్రికి దౌత్యపరమైన విజయంటూ అమిత్‌షా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఆగస్టు నెలలో జరిగిన ఆర్టికల్ 370 రద్దు ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వం ముందస్తుగా జమ్ము కశ్మీర్‌ అంతటా భారీగా భద్రతా దళాలను మోహరింపజేసింది. అటు తర్వాత సమాచార వ్యాప్తిని అరికట్టే విధంగా ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్‌ను కూడా నిలపివేశారు. అదే సమయంలో పలువురు రాష్ట్రా రాజకీయ నేతలను కూడా అరెస్టు చేసి గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్