క‌రోనా అల‌ర్ట్ః ఇంటి వ‌ద్ద‌కే వైర‌స్‌ టెస్ట్ ల్యాబ్‌

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. రోజురోజుకూ జ‌డ‌లు విప్పుకుంటున్న వైర‌స్ ర‌క్క‌సిని క‌ట్ట‌డిచేసేందుకు కేంద్రం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. వీలైనంత ఎక్కువ టెస్టులు చేస్తూ వైర‌స్ బాధితుల‌ను గుర్తించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు....

క‌రోనా అల‌ర్ట్ః ఇంటి వ‌ద్ద‌కే వైర‌స్‌ టెస్ట్ ల్యాబ్‌
Follow us

|

Updated on: Jun 18, 2020 | 9:33 PM

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. రోజురోజుకూ జ‌డ‌లు విప్పుకుంటున్న వైర‌స్ ర‌క్క‌సిని క‌ట్ట‌డిచేసేందుకు కేంద్రం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. వీలైనంత ఎక్కువ టెస్టులు చేస్తూ వైర‌స్ బాధితుల‌ను గుర్తించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు మొబైల్ టెస్టింగ్ సెంటర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

దేశంలోనే తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం ప్రారంభించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. వీటి ద్వారా రోజు 25 ఆర్టీ పీసీఆర్ టెస్టులు, 300 ఎలీసా టెస్టులు చేయడమే కాకుండా, హెచ్ఐవీ, టీబీ పరీక్షలు కూడా చేసే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఫిబ్రవరిలో భారత్ లో కరోనాతో పోరాటం మొదలైందని, అప్పుడు దేశంలో ఒకే ఒక్క కరోనా పరీక్షల కేంద్రం ఉండ‌గా, ఇప్పుడు దేశవ్యాప్తంగా 953 ఉన్నాయని తెలిపారు.