మమతపై కేంద్రమంత్రి ఫైర్!

బెంగాల్‌ వైద్యులకు మద్దతుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్ మండిపడ్డారు. వైద్యుల విషయంలో మమత పంతానికి పోవొద్దు అని ఆయన ఆమెకు సూచించారు. డాక్టర్ల నిరసనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పందిస్తూ.. డాక్టర్ల ఆందోళన విషయంలో మమత పంతానికి పోవొద్దని ఆమెకు అప్పీల్‌ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆందోళనలు విరమించి.. తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లకు అల్టిమేటం జారీ చేసినందునే వారు నిరసనలు కొనసాగిస్తున్నారని కేంద్రమంత్రి వివర్ంచారు. ఈ రోజు తాను మమతతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇక డాక్టర్ల రక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నానని, తక్షణమే ఆందోళనలు విరమించి.. విధుల్లో చేరాలని కేంద్రమంత్రి వైద్యులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *