ఏపీ సీఎం జగన్‌కు కేంద్రం షాక్.. ఎందుకో తెలుసా?

పరిపాలనలో తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్ ఇప్పటికే పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్‌పై అనుకున్నది సాధించారు. దీనిద్వారా భారీగా డబ్బు ఆదా అవుతున్న విషయంపై జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అయితే అదే పద్ధతిలో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి చేసిన ఒప్పందాలను సమీక్షించాలని కూడా నిర్ణయించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. పీపీఏల వ్యవహారంలో మరోసారి ఆలోచించాలని, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం […]

ఏపీ సీఎం జగన్‌కు కేంద్రం షాక్.. ఎందుకో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 12:24 AM

పరిపాలనలో తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్ ఇప్పటికే పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్‌పై అనుకున్నది సాధించారు. దీనిద్వారా భారీగా డబ్బు ఆదా అవుతున్న విషయంపై జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అయితే అదే పద్ధతిలో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి చేసిన ఒప్పందాలను సమీక్షించాలని కూడా నిర్ణయించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. పీపీఏల వ్యవహారంలో మరోసారి ఆలోచించాలని, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. వాటికి మరోసారి సమీక్షించాల్సిన అవసరం లేదని ఆలేఖలో మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హాయాంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని, వీటిని మరోసారి సమీక్షించనున్నట్టు ప్రధాని మోదీకి సీఎం జగన్ జూలై 25న ఓ లేఖ రాశారు. అయితే ఈ లేఖను ప్రధామంత్రి కార్యాలయం ఇంధన శాఖకు పంపింది. దీంతో ఆ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పందిస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. మీరు సమీక్ష చేయాలనుకుంటున్న మూడు సంస్ధల కెపాసిటీ 2014 కంటే ముందే కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని, అందువల్ల వీటిని సమీక్షించాల్సిన అవసరం లేదని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగా సమీక్ష జరిపితే దాని ప్రభావం పెట్టుబడిదారులతో పాటు దేశ విద్యుత్ రంగ విధానంపై తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ప్రతి ఏడాది ధరలు మారిపోతూ ఉంటాయనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్