జులై నుంచి తెరుచుకోనున్న స్కూల్స్..? కేంద్రం కసరత్తు..!

కరోనావైరస్.. విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో కొన్ని విద్యాసంస్థలు పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేస్తూ విద్యా సంవత్సరాన్ని ముగించాయి. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలన్న స్పష్టత కరువైంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా స్కూళ్లను తెరించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను వచ్చేవారంలో కేంద్ర ప్రభుత్వం జారీచేయనుంది. సుదీర్ఘ లాక్‌డౌన్‌లతో స్కూల్స్‌ ఎప్పుడు తెరుచుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతుండగా జులై నుంచి స్కూళ్లను దశలవారీగా రీ-ఓపెన్‌ చేయాలని భావిస్తోంది కేంద్ర […]

జులై నుంచి తెరుచుకోనున్న స్కూల్స్..? కేంద్రం కసరత్తు..!
Follow us

|

Updated on: May 25, 2020 | 7:43 PM

కరోనావైరస్.. విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో కొన్ని విద్యాసంస్థలు పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేస్తూ విద్యా సంవత్సరాన్ని ముగించాయి. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలన్న స్పష్టత కరువైంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా స్కూళ్లను తెరించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను వచ్చేవారంలో కేంద్ర ప్రభుత్వం జారీచేయనుంది. సుదీర్ఘ లాక్‌డౌన్‌లతో స్కూల్స్‌ ఎప్పుడు తెరుచుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతుండగా జులై నుంచి స్కూళ్లను దశలవారీగా రీ-ఓపెన్‌ చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తొలుత గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో స్కూళ్లను తెరిపించి.. అక్కడ ఎనిమిదో తరగతి పైబడిన విద్యార్ధులనే మాత్రమే అనుమతించేలా ఫ్లాన్ చేస్తోంది. చిన్న తరగుతుల విద్యార్ధులను తదుపరి దశలో స్కూళ్లకు అనుమతించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాలలను రెండు షిఫ్ట్‌లలో పనిచేసేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టనున్నారు.కాగా, కేవలం 30 శాతం హాజరుతోనే పాఠశాలలు పనిచేస్తాయని మానవవననుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఇటీవల టీచర్లతో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. ఇక, కాలేజీలు, యూనివర్సిటీల పునఃప్రారంభానికి అవసరమైన భద్రతా పరమైన మార్గదర్శకాలను యూజీసీ వెల్లడిస్తుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.