అన్ లాక్ 4.0 ప్రకటనతో అప్రమత్తమైన హైదరాబాద్ మెట్రోరైలు

లోకల్ రైళ్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనుమతించాలనే యోచనలో కేంద్రం ఉందన్న వార్తలతో హైదరాబాద్ మెట్రో అప్రమత్తమైంది. మెట్రో రైళ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ రావచ్చన్న వార్తలతో సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో.

అన్ లాక్ 4.0 ప్రకటనతో అప్రమత్తమైన హైదరాబాద్ మెట్రోరైలు
Follow us

|

Updated on: Aug 25, 2020 | 4:25 PM

అన్‌లాక్ 4లో కేంద్ర అనుమతించే సర్వీసుల్లో లోకల్ రైళ్లు, మెట్రో సేవలు, ఆడిటోరియంలు, సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు ఉండే అవకాశాలున్నాయి. ఆర్థిక కార్యకలాపాల కొనసాగింపులో భాగంగా మరిన్ని సడలింపులను ఇవ్వనుంది కేంద్రం. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంచనాల ఆధారంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని భావిస్తున్నారు. ఇంతవరకూ, లోకల్ రైళ్లు, మెట్రో రైళ్లు, సింగిల్ థియేటర్ సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్ వంటివి అనుమతించాలంటూ కేంద్రానికి పలు సలహాలు, సూచనలు అందాయి. అయితే, వీటిని అనుమతించే విషయంలో ఇంకా కేంద్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

లోకల్ రైళ్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనుమతించాలనే యోచనలో కేంద్రం ఉందన్న వార్తలతో హైదరాబాద్ మెట్రో అప్రమత్తమైంది. మెట్రో రైళ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ రావచ్చన్న వార్తలతో సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో. హైదరాబాద్ లోని అన్ని మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో రైళ్ల ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇన్ని రోజులుగా స్తంభించిన పోయిన రవాణాను పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణంలో ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా మెట్రో రైళ్ల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రైళ్లే నడిస్తే ఉండే పరిస్థితులకు అన్ని స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు సిబ్బంది. అన్ని స్టేషన్స్ ల్లో శానిటేషన్ తో పాటు భౌతిక దూరంలో టికెటింగ్ లకు ఏర్పాట్లు చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్, టెంపరేచర్ చెక్, సామర్థ్యం కంటే తక్కువ మందిని అనుమతించడం వంటి సామాజిక దూరం నిబంధనలు తప్పనిసరి చేయనున్నారు. ఇక ఇప్పటికే విధుల హాజరు కావల్సిందిగా సిద్ధంగా ఉండాలని మెట్రో సిబ్బందికి కాల్ లెటర్స్ కూడా పంపినట్లు తెలుస్తోంది. కాగా, వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి ఏ మేరకు కార్యకలాపాలను విస్తరించాలనే నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!