Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • బెంగుళూరు అల్లర్ల కేసులో సయ్యద్ సాదిక్ అలీని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. ఆగస్టు 11న డీజే హాలి, కేజీ హాలీ పోలీస్ స్టేషన్ల పై దాడి లతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై అల్లరి మూకల విధ్వంసం. ఈ దాడి వెనకాల ఉన్న సయ్యద్ సాదిక్ అలీ ని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. బెంగళూరులో ఓ బ్యాంకు రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ సాదిక్ అలీ. ఆగస్టు 11 అల్లర్లు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సయ్యద్. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబర్ 21న బెంగళూరు అల్లర్ల పై కేసు నమోదు చేసిన ఎన్ ఐ ఎ. ఈరోజు బెంగళూరులో 30 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ ఐ ఏ. సోదాల్లో ఎయిర్ గన్, షార్ప్ ఆయుధాల తో పాటు, ఐరన్ రోడ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న ఎన్ ఐఎ.
  • ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కి కోరిన పాజిటివ్. నిన్నటి నుండి బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.
  • ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీరియస్. ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు. కోవిడ్, డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిపాలైన డిప్యూటీ సీఎం. ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు.
  • ముంబై బయలుదేరిన రకుల్ . ncb ముందు హాజరవడానికి కాసేపటి కిందట హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన నటి రకుల్ ప్రీత్ సింగ్. రేపు ఎన్ సి బి ముందు విచారణకు రానున్న రకుల్.
  • కర్నూలు జిల్లా: శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం. ఘంటా మఠం పునర్నిర్మాణ పనుల్లో బయట పడిన 6 అడుగుల ధ్యాన మందిరం. ధ్యాన మందిరం లోపలి భాగంలో వైవిధ్యంగా ఉన్న సొరంగం. ధ్యాన మందిరం లోపల నైరుతి భాగం నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం మార్గం నుంచి తూర్పు వరకు సొరంగం ఉన్నట్లు గుర్తించిన దేవస్థానం అధికారులు. పది రోజుల క్రితమే ఘంటా మఠంలో బయటపడిన వెండి నాణేలు, తామ్ర శాసనాలు. ధ్యాన మందిరాన్ని యథావిధిగా పునర్నిర్మిస్తాం : ఈవో రామారావు.
  • రేపట్నుంటి సిటీబస్సులు - మంత్రి పువ్వాడ అజయ్. 25 శాతం బస్సులు నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం - మంత్రి పువ్వాడ అజయ్.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు జల గండం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను వానలు దంచికొడుతున్నాయి. నాలుగురోజులుగా పడుతున్న వానలతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు కాలనీలను వరద ముంచెత్తడంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరగా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది.

Uninterrupted Rains, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు జల గండం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను వానలు దంచికొడుతున్నాయి. నాలుగురోజులుగా పడుతున్న వానలతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు కాలనీలను వరద ముంచెత్తడంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరగా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది.

కోడేరు మండలంలోని పసులు వాగు పొంగి పొర్లడంతో కోడేరు, జనంపల్లి, తీగలపల్లి, బావాయిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లాపూర్ మండంలోని ముక్కిడిగుండం గ్రామానికి చెందిన పెద్దవాగు, ఉడుముల వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో రోడ్డు కుండిపోయి తెగిపోవడంతో.. లింగంపల్లి తండా, మల్లేశ్వరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముత్తిరెడ్డిపల్లి వాగు సమీపంలోని పొలాల్లో ఉన్న రెండు ట్రాక్టర్లు వాగులో కొట్టుకుపోయాయి.

నాగర్ కర్నూల్ జిల్లా చెర్ల తిర్మాలాపూరం రోడ్డుపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లింగంపెల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల కల్వకుర్తి-నాగర్ కర్నూల్ మధ్య రాకపోకలకు అంటంకంగా మారాయి. కేసరి సముద్రం ప్రస్తుతం నిండుకుండలా మారింది. వరద నీటికి అలుగుపారుతుండడంతో.. అక్కడ చెట్ల పొదల్లో చిక్కుకున్న ఓ కుక్కను గమనించిన పోలీసులు కాపాడారు. ప్రొక్లైనర్‌ సహాయంతో ఓ హోంగార్డు వాగులోకి దిగి కుక్కను బయటకు తీసుకువచ్చాడు.

జూరాల ప్రాజెక్టు జలసిరితో ఉట్టి పడుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. 24 గేట్లను ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల వరకు దిగువకు నీటిని వదులుతున్నారు. అలాగే కోయిస్ సాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతుండడంతో రెండు గేట్లు ఎత్తారు. రామన్ పాడు ప్రాజెక్టుకు చెందిన తొమ్మిది గేట్లనున కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో వర్షాలకు సుమారు ఇరవై ఇండ్లు కూలిపోయాయి. కుడికిళ్ల గ్రామంలో ఇల్లు కూలి దేవమ్మ అనే వృద్దురాలు మృతి చెందింది. ధన్వాడ మండలంలో ఇల్లు కూలి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన స్థానిక నేతలు ప్రజలను పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

అటు.. వర్షాలకు పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. వేల ఎకరాలు నీట మునిగాయి. దీంతో చేతికొచ్చే సమయంలో పంట వరద పాలు కావడంతో రైతులు కష్టాల వర్ణనాతీతంగా మారాయి. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో పాటు రైతులను ఆదుకోవాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

Related Tags