తలనొప్పి తగ్గాలంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి..!

సాధారణంగా మనందరికీ తలనొప్పి ఏదో ఒక కారణంతో రోజూ వస్తూ ఉంటుంది. క్షణం తీరికలేని జీవనం. సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం.. నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి వ్యాధుల బారిన పడుతుంటాం. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో ముఖ్యమైంది తలనొప్పి. దీంతో బాధపడేవారిలో ఎక్కువ మహిళలే ఉన్నారు. అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం ఫలితంగా వచ్చే తలనొప్పితో ఏ పనీ సరిగ్గా చేయలేక మదనపడుతున్నారు. తలనొప్పి ఎక్కువైనప్పుడు చిరాకు, కోపం […]

తలనొప్పి తగ్గాలంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి..!
Follow us

|

Updated on: Apr 13, 2019 | 8:22 PM

సాధారణంగా మనందరికీ తలనొప్పి ఏదో ఒక కారణంతో రోజూ వస్తూ ఉంటుంది. క్షణం తీరికలేని జీవనం. సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం.. నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి వ్యాధుల బారిన పడుతుంటాం. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో ముఖ్యమైంది తలనొప్పి. దీంతో బాధపడేవారిలో ఎక్కువ మహిళలే ఉన్నారు. అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం ఫలితంగా వచ్చే తలనొప్పితో ఏ పనీ సరిగ్గా చేయలేక మదనపడుతున్నారు.

తలనొప్పి ఎక్కువైనప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పనిచేయడం కుదరదు. శబ్దాలు భరించలేకపోవడం, వెలుతురును సరిగ్గా చూడలేకపడం.. కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇవీ తలనొప్పి లక్షణాలు. ఇక ఏ తలనొప్పినైనా పెయిన్‌ కిల్లర్‌తో సరిపెట్టడం ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు.  కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం….

తలస్నానం చేసిన తర్వాత తల తడిగా ఉండడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. కాబట్టి తలస్నానం చేసిన ప్రతి సారి తలను పూర్తిగా ఆరబెట్టుకోవాలి. అందుకు డ్రైయ్యర్ ను ఉపయోగించనవసరం లేదు. సహజంగా వీచే గాలిలో కొద్దిసేపు ఆరబెట్టుకొన్నా సరిపోతుంది.

ఎండలో బయట తిరగడం: తలకు హ్యట్ పెట్టుకొని బయట ఎండలో తిరగడం మంచిదే. అయితే అతిగా వేడి తలకు తగిలినా కూడా తలనొప్పి రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఖాళీ కడుపుతో ఉండి ఎక్కువగా ఆకలి కలిగినప్పుడు, ఎండలో తిరగడం వల్ల అలసటకు గురైతే అది తలనొప్పికి దారితీస్తుంది.

డియోడరెంట్/ పెర్ఫ్యూమ్స్: ఉదాహరణకు ఎక్కువ సమయం పెర్ఫ్యూమ్ స్టోర్ లో నిలబడ్డా.. ఆ సువాసనలు మెదడుపై ప్రభావం చూపుతాయి. పరిమళభరితమైన సుగంధాలు ఎక్కువ ఘాటుగా ఉండటం చేత తలనొప్పి వస్తుంది. కాబట్టి ఎక్కువ ఘాటు వాసనలున్న పెర్ఫ్యూమ్ జోలికి వెళ్ళకండి.

కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ స్క్రీన్స్: ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అప్పుడప్పుడు కను రెప్పలను కదిలిస్తుండాలి. అదేవిధంగా ఎక్కువగా టీవీ చూడటం వల్ల కూడా కళ్ళు బాధిస్తాయి. కాబట్టి టీవీ చూడ్డానికి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.

నిద్రలేమి: మీరు సరిగా నిద్రపోనట్లైతే, అది మిమ్మల్ని అందవిహీనంగా మార్చడమే కాదు, తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది . కాబట్టి కనీసం 7-8గంటల సమయం గాఢంగా నిద్రపోవాలి. దాంతో నిద్ర లేవగానే మీ మైండ్ మరియు బాడీ రిలాక్స్ గా ఉండి ఏ పని చేయాలన్న ఉత్సాహంగా ఉంటారు.