ఉద్యోగం కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి..

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. వారందరికీ కూడా జీతంలో 50 శాతం నిరుద్యోగ భృతిగా చెల్లిస్తామని..

ఉద్యోగం కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి..
Follow us

|

Updated on: Sep 18, 2020 | 6:54 PM

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. వారందరికీ కూడా జీతంలో 50 శాతం నిరుద్యోగ భృతిగా చెల్లిస్తామని.. వారికి ఈ సాయం అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన కింద లభిస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ వెల్లడించింది. (Unemployment Allowance)

ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు దగ్గరలోని ఈఎస్ఐ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన పధకం జూలై 1 నుంచి అమలులోకి వచ్చిందని.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగుతుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న కార్మికులకు నిరుద్యోగ భృతి నేరుగా వారి ఖాతాల్లోకి పడుతుంది. కాగా, గతంలో నిరుద్యోగ భృతి వేతనంలో 25 శాతం ఉండగా.. ఇప్పుడు దాన్ని 50 శాతానికి పెంచడం గమనార్హం.

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!