క్రికెట్‌లో విషాదం.. బాల్ తగిలి అండర్ 19 ప్లేయర్ మృతి!

Under 19 Player Jahangir Ahmed Dies After Hit By Ball, క్రికెట్‌లో విషాదం.. బాల్ తగిలి అండర్ 19 ప్లేయర్ మృతి!

జమ్మూకశ్మీర్: క్రికెట్ ఆడుతుండగా బాల్ గట్టిగా తగిలి అండర్ 19 క్రికెటర్ మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకుంది. అనంతనాగ్ పట్టణంలో బారాముల్లా, బుద్గాం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జహంగీర్ అహ్మద్(18) అనే ఆటగాడికి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బలమైన బౌన్సర్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. మ్యాచ్ నిర్వాహకులు, తోటి క్రికెటర్లు హుటాహుటిన జహంగీర్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో తుది శ్వాస విడిచాడు. మరోవైపు జహంగీర్ మృతిపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *