వీఆర్వో నోటీస్: చంద్రబాబు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి

Undavalli VRO reaches Chandrababu's house to give a notice to vacate home, వీఆర్వో నోటీస్: చంద్రబాబు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి

గత కొద్ది రోజులుగా.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందు అక్రమంగా కరకట్టపై ఇళ్లు కట్టారని.. దానిని చంద్రబాబు ఖాళీ చేయాలని పెద్ద హైప్ క్రియేట్ చేశారు. తాజాగా.. నిన్న కూడా.. చంద్రబాబు ఇంటిపై.. డ్రోన్ కెమెరాతో.. బయటి వ్యక్తులు.. ఆయన ఇంటిపై.. వీడియో తీశారు. దీంతో.. అక్కడ పెద్ద రాద్ధాంతమే జరిగింది. దీనిపై సీఎం చంద్రబాబు ఏపీ డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్ జీపుకు అడ్డంగా నిరసనలు, ఆందోళనలు కూడా నిర్వహించారు.

కాగా.. తాజాగా.. ఈరోజు మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి ఉండవల్లి వీఆర్వో వెళ్లారు. అక్కడ కృష్ణనది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని.. నోటీసులు ఇచ్చి వెళ్లినట్టు సమాచారం. అలాగే.. చంద్రబాబు ఇంటితో కరకట్టపై వున్న మిగిలిన ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఆయన ఇంటికి వరద ముప్పు ఉందని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో.. ఇళ్లు ఖాళీ చేయమని.. ఉండవల్లి వీఆర్వో నోటీసులు ఇచ్చి వెళ్లారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా.. ఇప్పటికే చంద్రబాబు ఇంటి బయట పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. కాగా.. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయామని ఉండవల్లి వీఆర్వో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *